సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి.
రాజన్న సిరిసిల్ల జిల్లా: వాహనాలకు నంబర్లు తొలగించిన,ఏర్పడకుండా మార్ఫింగ్ చేసిన చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ముస్తాబద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీ సమయంలో నంబర్ ప్లేట్ కనపడకుండా తొలగించబడిన వాహనదారునిపై చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగిందని సి.ఐ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ….తేది.06.12.2024 రోజున ఉదయం ఆరుగంటలకు ముస్తాబాద్ ఎస్.ఐ తన సిబ్బందితో వాహనాల తనిఖీ చేస్తుండగా మహేంద్ర బొల్లెర్రో వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ను ఏర్పడకుంగా రెండు అక్షరాలను తీసేసి నా వాహనం వస్తుండగా పోలీస్ వారు అట్టి వాహనంను ఆపగా దాని డ్రైవర్ కొంచెం దూరంలో పోలీస్ వారిని చూసి ఆపి వాహనంను అక్కడే వదిలి పెట్టి పారిపోగా ఎస్.ఐ అట్టి వాహనం తనిఖీ చేసి సెజ్ చేయగా,వాహన నెంబర్ ప్లేట్ ను ఏర్పడకుండా అక్షరాలు తీసేసి నడుపుతు పారిపోయిన డ్రైవర్ పై చీటింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నాము అని తెలిపారు.
వాహనదారులకు ముఖ్య గమనిక జిల్లాలో నెంబర్ లేకుండా కానీ నంబర్ ప్లేట్ ఏర్పడకుండా ఏదైనా అడ్డుపెట్టిన, సగం నంబర్లు తొలగించి వాహనం నడిపితే చీటింగ్ కెసులు నమోదు చేయడం జరుగుతుందని సిరిసిల్ల రురల్ సి.ఐ మొగిలి ఒక ప్రకటనలో తెలిపారు.







