పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ

పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి ,విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామలలో విధిగా పర్యటించాలి.గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చెయాలి.

 Rajanna Sircilla District Sp Inspects The Police Station, Dsp Chandrasekhar Redd-TeluguStop.com

వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు మరింత చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని, విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తు విలేజ్ పోలీస్ అధికారులు విధిగా గ్రామాల్లో పర్యటించలని జిల్లా ఎస్పీ సూచించారు.

ఈరోజు వార్షిక తనిఖీ లో భాగంగా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి పోలీస్ స్టేషన్ పరిసరాలు,5s అమలు తీరు రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాల ను తిరిగి క్షుణ్నంగా పరిశీలించారు.

పెండింగ్లో ఉన్న కేసులపై రివ్యూ చేసి,పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి పలు సూచనలు చేసి పోలీస్ స్టేషన్ల పరిధిలోని కేసుల నమోదు,శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ప్రజా సమస్యల పైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా బరోసా కల్పించే విధంగా విధులు నిర్వర్థించాలని,పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు.

పాత నేరస్థులపై నిఘా ఉంచలని, నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు గంజాయి వలన కలుగు అనర్ధాలు,మహిళ చట్టాలు, సైబర్ నేరాలు, మొదలగు వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలకు, వ్యాలరస్థులకు సీసీ కెమెరాల ఉపయోగం, నేర నియాత్రణలో సీసీ కెమెరాల ప్రముఖ్యాత గురించి అవగాహన కల్పిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తున్న దాని గురించి అధికారులకు సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

అనంతరం స్టేషన్ పరిధిలోని వృద్ధులకు, మహిళలకు దుప్పట్లు,మరియు యువతకు స్పోర్ట్స్ టిషార్ట్స్ అందించిన జిల్లా ఎస్పీ.ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ మొగిలి, ఎస్.ఐ గణేష్, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube