దొంగతనం కేసులో ఏడాది జైలు శిక్ష.

రాజన్న సిరిసిల్ల జిల్లా:దొంగతనం కేసులో నిందుతునికి ఒక (1) సంవత్సరo జైలు శిక్షతో పాటు వంద రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు సిరిసిల్ల పట్టణ సి.ఐ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

 One Year In Prison For Theft, Rajanna Siricilla, Theft, Kancham Venuku, Nizamaba-TeluguStop.com

ఈ మేరకు సి.ఐ మాట్లాడుతు….నిజామాబాద్ జిల్లా లింగపూర్ గ్రామానికి చెందిన వేగం శ్రీనివాస్ తండ్రి పేరు సాయన్న వయసు 60 సంవత్సరాలు అనే వ్యక్తి సిరిసిల్లకు వచ్చి సిరిసిల్లలోని శాంతినగర్ లో రూమ్ అద్దెకి తీసుకొని మేస్త్రి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.తేదీ 26 ఫిబ్రవరి 2024 నాడు చంద్రంపేటకు మేస్త్రి పనికి వెళ్లి పని చేసి సాయంత్రం అందాజా ఆరు గంటల సమయంలో సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద బండి మార్చి పోయి ఇంటికి వెల్గంటలకు సిరిసిల్లలోని పాత బస్టాండ్ వద్ద తన బండిని పెట్టి మరిచిపోయి ఇంటికి వెళ్లగ రాత్రి బండి గుర్తుకు వచ్చి పాత బస్టాండ్ కు వచ్చి చూడగా నా బండి కాలిపోయి ఉండగా రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా బండి తగలపెట్టారు అని శ్రీనివాస్ పిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దొంగతనం చేయుటకు ప్రయత్నము చేసి తాళం రాకా కాలబెట్టిన కేసులో కంచం వేణు తండ్రి :-నర్సయ్య వయస్సు:-42 సంవత్సరాలు, సుభాష్ నగర్ సిరిసిల్లకు చెందిన వ్యక్తిని అరెస్టు చేసి ఎస్ ఐ మల్లేశం రిమాండ్ కి తరలించడం జరిగింది.విచారణ అనంతరం విచారణ అధికారి ఎల్లగౌడ్ ఎస్ ఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా CMS ఎస్.ఐ.రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ , ఆరు(6) మంది సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రాసిక్యుశన్ తరుపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుముల సందీప్ వాదించగా కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ.ప్రవీణ్ నేరస్తుడు అయిన కంచం వేణుకు (1) సంవత్సరo కఠిన కారాగార జైలు శిక్ష తో పాటు వంద రూపాయల జరిమానా విదించడం జరిగింది అని సిరిసిల్ల పట్టణ సిఐ కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube