సొంత మండలం పై దృష్టి పెట్టండి.తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించండి.
తన మిత్రుడు చొప్పదండి ఎం ఎల్ ఏ కు విన్నవించిన మాజీ ఎంపీటీసీ రాజన్న సిరిసిల్ల జిల్లా :మీరు పుట్టి పెరిగిన ఎల్లారెడ్డిపేట మండలం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సింగ సముద్రం కనెక్టింగ్ కాలువల చైర్మన్ ఒగ్గు బాలరాజు యాదవ్ చొప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం ను కోరారు.ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరుగగా మేడిపల్లి సత్యంను తన మిత్రుడు ఒగ్గు బాలరాజు యాదవ్ కలిసి సింగ సముద్రం కు సంబంధించిన సమస్యలను వివరించారు.
చొప్పదండి శాసన సభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం స్వగ్రామం కోరుట్లపేట లో గల సౌడలమ్మ చెరువు నుండి సింగ సముద్రం కట్ట పై వరకు సుమారు ఐదు కిలోమీటర్ల వరకు రైతులు వెళ్ళడానికి ప్రస్తుతం మట్టి రోడ్డు ఉందని దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ మట్టి రోడ్డు ను తారు రోడ్డు గా మార్చాలని సత్యంకు వివరించగా తారు రోడ్డు నిర్మాణం కోసం నిధుల మంజూరు కోసం కృషి చేస్తాననీ సత్యం హామీ ఇచ్చారు.