సినిమా ఇండస్ట్రీలో కొనసాగి సెలబ్రిటీల గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.ఇక కొంతమంది సెలబ్రిటీల పట్ల భారీ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.
ఇలా తమ గురించి వచ్చే విమర్శల పట్ల సెలబ్రిటీలు పెద్దగా స్పందించరు కానీ ఆ ట్రోల్స్( Trolls ) శృతి మించితే మాత్రం వెంటనే వాటిపై స్పందిస్తూ తగిన సమాధానం చెబుతూ ఉంటారు.తాజాగా అసలు సెలబ్రిటీలను ట్రోల్ చేసే వారి గురించి నాగచైతన్య ( Naga Chaitanya ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి.

నాగచైతన్య తాజాగా యంగ్ హీరో కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) హీరోగా నటించిన క అనే సినిమా( KA Movie ) ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా హీరో కిరణ్ అబ్బవరం తన పట్ల వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ విధంగా తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కిరణ్ అబ్బవరం ఆవేదన వ్యక్తం చేయడంతో అనంతరం నాగచైతన్య ట్రోలర్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ.నేను ఎంతో సపోర్టుతో ఇండస్ట్రీలోకి వచ్చాను కానీ కిరణ్ అబ్బవరం లాంటి వాళ్లు ఇక్కడికి రావడానికి పడిన కష్టం నాకు తెలియకపోవచ్చు.కిరణ్ నీలో చాలా శక్తి ఉంది.
నిన్ను ట్రోల్ చేసే వారి చేతిలో కేవలం కీబోర్డు మాత్రమే ఉంది.అలాంటి వారికి బుర్రలో గుజ్జు ఉండదని చైతన్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రోలింగ్స్ పై భయపడాల్సిన పని లేదు.ఆ స్థాయిని దాటి నువ్వు ఎప్పుడో వచ్చావు అంటూ ట్రోలర్స్ పై నాగచైతన్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక గతంలో కూడా నాగచైతన్య భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి ముఖ్యంగా సమంత నాగచైతన్య విడాకులు( Divorce )తీసుకొని విడిపోయి నాగచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న సమయంలో కూడా చాలామంది నాగచైతన్యను కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు.







