ఆల్ ది బెస్ట్ రామ్.. నాలుగో తరం వారసుడికి విషెస్ చెప్పిన ఎన్టీఆర్?

సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.సీనియర్ దివంగత నటుడు నందమూరి తారక రామారావు గారి వారసులుగా ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చారు కానీ బాలకృష్ణ ( Balakrishna ) మాత్రమే ఇండస్ట్రీలో హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు.

 Ntr Best Wishes To Her Brother Son Taraka Ramarao Enter Into Industry Details, N-TeluguStop.com

ఇక హరికృష్ణ( Harikrishna ) కూడా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన ఎక్కువకాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగలేకపోయారు.ఇక ఎన్టీఆర్ రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తన తండ్రికి చేదోడువాదోడుగా హరికృష్ణ రాజకీయాలలోకి వచ్చి బిజీగా మారిపోయారు.

Telugu Taraka Ramarao, Janakiram Son, Ntr Wishes, Taraka Ramamrao, Tarakaramarao

ఇక హరికృష్ణ వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్నారు.ఇక ఎన్టీఆర్( NTR ) అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో మూడు తరాల నందమూరి వారసులు కొనసాగుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు అయితే  అతి త్వరలోనే నందమూరి నాలుగో తరం వారసుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తుంది.హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్( Janaki Ram ) గురించి అందరికీ తెలిసిందే.

Telugu Taraka Ramarao, Janakiram Son, Ntr Wishes, Taraka Ramamrao, Tarakaramarao

ఈయన గత కొన్ని సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించారు.అయితే ఈయనకి ఇద్దరు కుమారులు.పెద్ద కుమారుడి పేరు కూడా నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Ramarao ) కావటం విశేషం.అయితే ఈ ఎన్టీఆర్ ను వైవిఎస్ చౌదరి( YVS Chowdary ) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నట్లు ఇదివరకే వెల్లడించారు.

ఇలా ఎన్టీఆర్ ను హీరోగా పరిచయం చేస్తూ తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బెస్ట్ విషెస్ తెలిపారు.

తొలిమెట్టు ఎక్కుతున్నావ్ ఆల్ ది బెస్ట్ రామ్. ఇండస్ట్రీ నీకు ఎన్నో అనుభూతుల్ని పంచుతుంది.

నువ్వు మంచి విజయం సాధించాలి.నీకు మీ ముత్తాత ఎన్టీఆర్, తాత హరికృష్ణ, తండ్రి జానకిరామ్ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటూ ట్వీట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube