ఆ స్టైల్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ.. తారక్ ఇమేజ్ ను ప్రశాంత్ మార్చనున్నారా?

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్( NTR ) అలాగే ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి అన్ని రకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.వచ్చేనెల అనగా నవంబర్ చివరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది సమాచారం.

 Prashanth Neel Ditches Black Theme For Ntr Film Details, , Prashanth Neel, Ntr,-TeluguStop.com

అయితే ప్రస్తుతం బాలీవుడ్ మూవీ వార్ 2 లో( War 2 ) నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ప్రశాంత నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పనుల్లో పాల్గొన్న పోతున్నట్లు తెలుస్తోంది.వార్ 2 షూటింగ్ పూర్తి అయిన తర్వాత జనవరి చివరి వారంలో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌లో చేరతారని అంచనా.

Telugu Salaar, Black Theme, Ntr Neel, Ntr, Prashanth Neel, Tollywood-Movie

ప్రాథమికంగా యంగ్ టైగర్ లేని సన్నివేశాలను మొదటగా చిత్రీకరించనున్నారు.ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే తీశారు.కేజీఎఫ్ ను( KGF ) రెండు భాగాలుగా తెరకెక్కించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ బ్లాక్ థీమ్, డార్క్ విజువల్స్‌ తోనే సాగుతుండటం వల్ల ప్రేక్షకులకు కొంత రొటీన్ మొనాట‌న‌స్ ఫీలింగ్ కలుగుతోందని భావిస్తున్నారు.

ముఖ్యంగా సలార్ సినిమా( Salaar ) ట్రైలర్ చూసినప్పుడు బ్లాక్ థీమ్ ఓవర్‌డోస్ అనిపిస్తోందని ఫీడ్‌ బ్యాక్ వచ్చింది.ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో తీసే కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు.

Telugu Salaar, Black Theme, Ntr Neel, Ntr, Prashanth Neel, Tollywood-Movie

ఈ సినిమాకి కథా నేపథ్యం, విజువల్స్ లో కొత్తదనం చూపించేలా ప్లాన్ చేస్తున్నట్లు యూనిట్ వర్గాల నుంచి సమాచారం.అయితే ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ లోని బ్లాక్ థీమ్, సినిమాలో ఉండదని, ఇది ఒక కొత్త స్టైల్‌ లో ఉండబోతుందని తెలుస్తోంది.ప్రశాంత్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ సినిమాతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట.కాగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ సినిమాతో అతని పాత్రలో కొత్తదనం ఆశిస్తున్నారట.ఒకవేళ ప్రశాంత్ తన గత సినిమాల థీమ్ నుంచి వేరే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే, ఇది అభిమానులకు కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకం ఉంది.ఇక బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని కూడా ఒక టాక్ వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube