తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న రాజమౌళి ( Rajamouli )ప్రస్తుతం పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.అయితే ఇదిలా ఉంటే ఆయన తమిళ్ స్టార్ హీరో అయిన సూర్యతో ఒక సినిమా చేయాల్సింది.
కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది.మరి ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమాలో సూర్యని ఒక క్యారెక్టర్ లో తీసుకోబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియదు కానీ సూర్య( Surya ) కూడా ఇందులో నటిస్తున్నాడు అంటు కోలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలవడుతున్నాయి… బాహుబలి సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే సూర్య మాట్లాడుతూ అవకాశం వస్తే రాజమౌళి సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ లో అయిన సరే నటిస్తాను అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు.మరి దాని వల్ల ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో సూర్య చేత నటింపజేయాలని రాజమౌళి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటికే అతనితో సంప్రదింపులు జరిపి అతన్ని ఒప్పించినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని నేర్చుకునే పనిలో ఉన్న రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు.ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా వాళ్ళందరికి ఒక గొప్ప అనుభూతిని కూడా ఇస్తుందంటూ చాలామంది సినీ మేధావులు ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెట్టుకున్నారు…ఇక ఈ సినిమాని సంక్రాంతి నుంచి సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడు తెలుగు సినిమా ఖ్యాతిని అంతకంతకు పెంచుతూ ఉండడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…
.







