మంచి సినిమా కథలన్నీ మొదట వారి దగ్గరకే వెళతాయి.... ఆ తరువాతే మా వరకు వస్తాయి!

నటుడు అడవి శేష్( Actor Adavi Shesh ) గురించి తెలుగు జనాలకి చెప్పాల్సిన అవసరం లేదు.ప్రముఖ రచయిత అడవి బాపిరాజు కుటుంబానికి చెందిన నాలుగవ తరం వాడు అడవి శేష్.

 Hero Adavi Sesh About Tollywood , Actor Adavi Shesh, Karma , Power Star Pawan Ka-TeluguStop.com

ముత్తాతకి తగ్గట్టే అడవి శేష్ కళా రంగంలోనే స్థిరపడ్డాడు.విదేశాల్లో పెరిగిన ఈ నటుడు, అక్కడ సినిమా కోర్సులు చేసినాక హైదరాబాదులో అడుగు పెట్టాడు.

ఈ క్రమంలోనే ‘కర్మ’ ( Karma )అనే సినిమాని చేసి, హీరోగా నటించి, దర్శకత్వం కూడా వహించడం జరిగింది.అయితే ఈ సినిమా వచ్చినట్టు చాలామందికి తెలియదు.

ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోయినప్పటికీ క్రిటిక్స్ నుండి మంచి మార్కులే సంపాదించింది.ఆ తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Power Star Pawan Kalyan ) నటించిన పంజా సినిమాలోని విలన్ పాత్రను పోషించిన శేష్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

Telugu Adavi Shesh, Adavisesh, Karma, Pawan Kalyan, Tollywood-Movie

ఆ తర్వాత వరుస సినిమాలలోనే హీరో పాత్రలు పోషిస్తూ రాణించాడు ఈ యువ హీరో.క్షణం, రన్ రాజా రన్, గూడచారి సినిమాల ద్వారా మంచి ప్రాచుర్యం పొందాడు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే, అదే సినిమాలకు రచయితగా వ్యవహరించడం కూడా జరిగింది.అందుకే ఈయనని టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ హీరో అని అంటూ ఉంటారు.

అసలు విషయంలోకి వెళితే, కొన్నాళ్ల క్రితం ఓ మీడియా వేదికలో మాట్లాడిన శేష్ మాటలు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Telugu Adavi Shesh, Adavisesh, Karma, Pawan Kalyan, Tollywood-Movie

మీ నుండి మంచి చిత్రాలు ఎందుకు రావడం లేదు? అని ఒక యాంకర్ అడగగా, శేష్ మాట్లాడుతూ… మా దగ్గర కొందరు బడా హీరోలు ఉంటారు.వారి కుటుంబంలో దాదాపు డజనకి పైగా హీరోలు ఉంటారు.మంచి మంచి కథలు అన్నీ మొదట వారి దగ్గరికి చేరుతాయి.

ఆ తర్వాత మా వైపు చూస్తారు.అలా మా దగ్గరికి వచ్చేసరికి, నేను చివరి లిస్టులో ఉంటాను.

ఇలాంటి సందర్భంలో మంచి కథలు తీయడానికి ఆస్కారం ఉండదు.ఎందుకంటే మా దగ్గర కథలను ఎంచుకోవడంలో ఆరోగ్యకరమైన వాతావరణం అనేది ఉండదు! అందుకే ఇక్కడ కొత్త వాళ్లకి, బ్యాక్ గ్రౌండ్ లేని వారికి చాలా కష్టం అవుతుంది! అని సమాధానం చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube