రాజన్న సిరిసిల్ల జిల్లా: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా భాగంగా ఈ రోజు 17వ పోలీస్ బెటాలియన్, సర్థాపూర్ నందు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కమాండెంట్ యస్.
శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థులకు వెపన్స్ పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా పెద్దూరు మండల ఉన్నత పాఠశాల విద్యార్థులకు పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ రకాల
ఆధునిక ఆయుధాలు, ఆయుధ పరికరములు, కమ్యూనికేషన్ పరికరములు మరియు వాటి పనితీరుకు సంబంధించిన వివరాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వచ్చేసిన విద్యార్థులు అందరూ ఎంతో ఆసక్తిగా ఆయుధాల(వెపన్స్) గురించి తెలుసుకున్నారు.సందేహాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సాంబశివరావు, ఉదయ్ భాస్కర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.