అమరుల త్యాగాలు స్ఫూర్తివంతం - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జిల్లా ఎస్పీ.ఓపెన్ హౌస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు పోలీసు చట్టాలు,కేసుల చెదన ,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఉపయోగాలు,డాగ్ ,బాంబ్ స్క్వాడ్,ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్,ట్రాఫిక్ నిబంధనలు,రోడ్డు నిబంధనలు,మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఏర్పాటయిన షీ టీం,భరోసా సెంటర్, సైబర్ నేరాలు,పోలీస్ శాఖలో ఉపయోగిస్తూన్నా ఆయుధాలు,సాంకేతిక పరిజ్ఞానం,పోలీస్ స్టేషన్ పని తీరు, డయల్100 గురించి వివరించారు.

 The Sacrifices Of Martyrs Are Inspiring District Sp Akhil Mahajan, Sacrifices ,m-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వారి త్యాగాలను స్మరిస్తూ ఈ రోజు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్స్ ఆవరణలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై,పోలీస్ శాఖ పనితీరు,వివిధ అంశాలపై విధ్యార్ధిని,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు.విద్యార్థులు విద్యతో సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగహన పెంచుకోవాలని,విద్యార్ధులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్ అంటే ఏమిటి,అది ప్రజలకు శాంతి భద్రతల విషయంలో ఏవిధంగా ఉపయోగపడుతుంది,పోలీస్ స్టేషన్ పని తీరు పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు ఏవిధంగా ఉంటుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అందు కోసం స్టాల్స్ ను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగహన కల్పించడం జరిగిందని తెలిపారు.

ఎస్పీ వెంట డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ కృష్ణ, ఆర్.ఐ లు యాదగిరి, రమేష్,మధుకర్, ఆర్.ఎస్.ఐ సాయికిరణ్, సిబ్బంది విద్యార్థులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube