అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ.10,000/- రూల జరిమానా.

రాజన్న సిరిసిల్ల జిల్లా: అదనపు కట్నం కోసం భార్యను వేదించిన భర్తకు ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ.10000/- రూల జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ సోమవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ దోమకొండ మండలం తుల్జాపూర్ గ్రామానికి చెందిన సుంకరి రాజు కు ముస్తాబద్ మండలం గూడెం గ్రామనికి చెందిన మేఘమాల తో 2010 సంవత్సరంలో వివాహం జరిగింది.వీరికి ఒక అబ్బాయి సంతానం కలుగగా,కొన్నేళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని భార్యను వేదింపులకు గురిచేసేవాడు.

 A Husband Who Harasses His Wife For Extra Dowry Is Sentenced To One And A Half Y-TeluguStop.com

వేధింపులు భరించలేక 2015 సంవత్సరంలో ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ సుంకరి రాజు పై ఫిర్యాదు చేసింది.పోలీసులు సుంకరి రాజు పై కేసు నమోదు చేసి కోర్టులో అప్పటి ఎస్ ఐ మారుతి చార్జిషీట్ దాఖలు చేశారు.

ప్రాసిక్యుషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ వాదించగా ముస్తాబాద్ ఎస్.ఐ.గణేశ్, సీఎంస్ ఎస్.ఐ.రవీందర్ నాయుడు, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ ఏడుగురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు.నిందుతుడు సుంకరి రాజు పై నేరం రుజువు చేయడంతో న్యాయమూర్తి ప్రవీణ్ ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు రూ.10000/- రూల జరిమానా విధించినట్లు ఎస్.ఐ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube