షాకింగ్ వీడియో: కారు ముందు కావాలనే పడిపోయిన మహిళ.. ఈవిడ డ్రామా చూస్తే..??

ఈరోజుల్లో రోడ్లపై వాహనదారులకు సేఫ్టీ లేకుండా పోయింది.రాష్ డ్రైవింగ్, రోడ్డు రేజ్ సంఘటనలు, కాపు కాచి విలువైన వస్తువులు దోచేసే దొంగలు ఇలా ఒకటేంటి ఇండియన్ రోడ్లపై ఎన్నో రిస్క్‌లు.

 If You See The Drama Of The Woman Who Fell In Front Of The Shocking Video Car ,-TeluguStop.com

తాజాగా మరో కొత్త రకం రిస్క్ వెలుగులోకి వచ్చింది.బెంగళూరులో ఈ ఒక విచిత్రమైన స్కామ్( Weird scam ) జరిగింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియోను కారులోని డ్యాష్ కెమెరా రికార్డ్ చేసింది.

ఇందులో ఒక మహిళ కారు వేగంగా వస్తుండగా దానిపైకి ఉద్దేశపూర్వకంగా ఎక్కి కింద పడిపోయింది.ఈ సంఘటన బిజీ రోడ్డు మీద జరిగింది.

ఆ మహిళ అలా రోడ్డుపైకి దూసుకు రాగానే డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు.సడన్ బ్రేక్‌ వేశాడు.కానీ ఆ మహిళ పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టింది.కారులో ఉన్నవారు పోలీసులకు ఫోన్ చేయగా, ఆ మహిళ పట్టించుకోకుండా నోట్లో నోట్లో గునుగుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఈ సంఘటనపై సోషల్ మీడియాలో ఓ తీవ్రమైన చర్చ మొదలైంది.

“కారులో డ్యాష్‌క్యామ్ ఉంచుకోండి.ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.ముఖ్యంగా, మహిళ డ్రామా ఆడితే, ప్రజలు వెంటనే ఆమె పక్షాన నిలబడతారు,” అని ఆ వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి రాశాడు.

ఆగస్టు 28న పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.చాలా మంది ఈ వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు.భారతదేశంలో కారు నడుపుతున్న వాళ్ళందరూ డ్యాష్‌క్యామ్ ( Dashcam )ఉంచుకోవాలని అంటున్నారు.

“కారు కొత్తగా కొన్నప్పుడే దానిలో డ్యాష్‌కెమెరా అనేది ఫిక్స్ చేసి ఇవ్వాలి.అది సీటు బెల్టు లాంటిదే.చాలా ముఖ్యమైనది.

బెంగళూరులో కార్లు, బైక్‌ వాళ్లను దొంగలు వేధిస్తున్నారు.అందుకే ప్రతి కారులో డ్యాష్‌కెమెరా ఉండాలి.ఇలాంటి సంఘటనలు జరుగుతున్న కారణంగా, ప్రజలు రోడ్లపై అదుపు లేకుండా ప్రవర్తిస్తున్న కారణంగా, ఇండియాలో డ్యాష్‌కెమ్ ఉంచుకోవడం చాలా అవసరం.” అని నెటిజన్లు పేర్కొన్నారు.ఇలాంటి స్కామర్ల కారణంగా తాము హైదరాబాద్ లో 1,500 నష్టపోయమని ఓ యూజర్ కామెంట్ చేశారు.ఇలాంటి వాళ్ల మోసాలు బయటపెట్టాలంటే కెమెరాలు ఇన్‌స్టాల్ చేసుకోవడం తప్పనిసరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube