వీడియో: గిల్లి పంచాయతీ పెట్టుకున్న ఓలా డ్రైవర్.. ఎత్తి కుదేసిన ఆడి ఓనర్..

ముంబైలో ఆడి కారు డ్రైవర్( Audi car driver in Mumbai ) ఓ దారుణానికి పాల్పడ్డాడు.దాని సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 The Audi Owner Who Was Picked Up By The Ola Driver And Hit By The Gilli Panchaya-TeluguStop.com

ఆ వీడియోలో ఒక ఆడి కారు యజమాని ఒక ఓలా కారు డ్రైవర్‌ను దారుణంగా కొట్టడం, తన్నడం, పైకి ఎత్తి నేలకేసి బాదడం కనిపించింది.దీనంతటికీ కారణం ఆ ఓలా కారు ఆడి కారు వెనుక భాగాన్ని టచ్ చేయడమే.

దానికే, ఆడి కారు యజమాని రిషభ్ చక్రవర్తి( Rishabh Chakraborty ), ఆయన భార్య అంతరా ఘోష్( Antara Ghosh ), మరొక మహిళ కారు దిగి ఓలా డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నారు.ఆయన్ని అవమానించాడు.

రిషభ్ చాలా హింసాత్మాకంగా ప్రవర్తించాడు.ఈ దృశ్యం మొత్తం 30 సెకన్ల వీడియోలో కనిపించింది.

ఇంత చిన్న ప్రమాదానికే అంతటి హింస అవసరమా అన్న ప్రశ్న నెటిజన్లలో ఉత్పన్నమవుతోంది.ఆ ఓలా కారు డ్రైవర్‌ పేరు కాయముద్దీన్‌( Kayamuddin ).అతన్ని కొట్టడం, ఎత్తి నేలపై పడవేయడంతో డ్రైవర్‌ తల నేలకు గట్టిగా తగిలి కొంతసేపు కదలకుండా పడి ఉన్నాడు.రిషభ్ అక్కడితో ఆగలేదు.

నేలపై పడి ఉన్న డ్రైవర్‌ను కాళ్ళతో తన్నాడు.చుట్టుపక్కల ఉన్నవారు కేవలం చూస్తున్నారు తప్ప ఏమీ చేయలేకపోయారు.

తలకు గాయాలైన డ్రైవర్‌ చివరకు లేచి నిలబడ్డాడు.

ఈ ఘటన ఆగస్టు 18న రాత్రి 11:20 గంటల సమయంలో ముంబైలోని ఘాట్కోపర్‌లోని ఒక మాల్ ఎదురుగా ఉన్న భవనం ప్రవేశ ద్వారం వద్ద జరిగిందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.కాయముద్దీన్ అనే ఓలా డ్రైవర్‌ను ముందుగా ఘాట్కోపర్‌లోని రాజావడి ఆసుపత్రికి తీసుకెళ్లి, తర్వాత ప్రభుత్వ జేజే ఆసుపత్రికి తరలించారు.డ్రైవర్‌ నుండి ఈ ఘటన గురించి వివరణను నమోదు చేసుకున్నారు.

భవనం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ దాడిని రికార్డ్ చేయబడింది.రిషభ్, ఆయన భార్యపై డ్రైవర్‌ను కొట్టినందుకు భారతీయన్యాయ సంహిత కింద కేసు నమోదు చేయబడింది.

ఈ దంపతులకు కోర్టులో హాజరు కావాలని నోటీసు జారీ చేయబడింది.ఇరువైపులా వచ్చిన ఆరోపణలు, ప్రతి ఆరోపణలను పోలీసులు విచారిస్తున్నారు.

“ఆ ఆడి కారు డ్రైవర్‌ను యూఏపీ చట్టం కింద కేసు పెట్టాలి.అంత అహంకారంతో ఉన్నాడు.ఇప్పుడు కొంతమంది అధికారం చూపించడానికి ఇష్టపడుతున్నారు.బలహీనులపై తమ అధికారాన్ని ప్రదర్శించడం మొదలుపెడుతున్నారు.ఎక్కడ చూసినా గొడవలే.కలియుగం వచ్చిందని నిజంగా అనిపిస్తోంది.” అని నెటిజన్లు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube