ఏపీలో మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.ఈ మేరకు అరకు,( Araku ) రంపచోడవరం( Rampachodavaram ) మరియు పాడేరు( Paderu ) నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.
ఈ క్రమంలో క్యూలైన్ లో వేచి ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు.అదేవిధంగా పాలకొండ, కురుపాం మరియు సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.
ఇక మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.అయితే ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదు అవుతుందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయంత్రం కల్లా భారీ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.