అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్ - బైడెన్‌ విజయావకాశాలపై జర్నలిస్ట్ ఫరీద్ జకారియా అంచనాలు

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి నెలకొంది.ఇప్పటికే డెమొక్రాటిక్ పార్టీ తరపున అధ్యక్షుడు జో డైడెన్,( President Joe Biden ) రిపబ్లికన్ పార్టీ నుంచి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) అధికారికంగా నామినేషన్ పొందారు.

 Cnn Seasoned Journalist Fareed Zakaria Predictions On Us Presidential Election D-TeluguStop.com

ఎన్నికల్లో ఏ పార్టీకి ఎడ్జ్ వుందో చెబుతూ ప్రతినిత్యం ఓపీయిన్ పోల్స్, సర్వేలు వెలువడుతున్నాయి.ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వార్తాసంస్థ సీఎన్ఎన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా( Fareed Zakaria ) వెలువరించిన అంచనాలు వైరల్ అయ్యాయి.

అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల్లో పోటీ తప్పదని.హష్ మనీ ట్రయల్ ట్రంప్‌కు, అతని మద్ధతుదారులకు సహాయం చేస్తుందని జకారియా అన్నారు.

Telugu Cnnjournalist, Cnn Journalist, Donald Trump, Fareed Zakaria, Joe Biden, C

ఫరీద్స్ టేక్ ఆన్ సీఎన్ఎన్( Take on CNN ) పేరిట ఆయన తన మోనోలాగ్‌ని ప్రారంభించారు.ట్రంప్‌తో నిక్కీ హేలీ, రాన్ డిసాంటింస్‌లు కలిసిపోయి డెమొక్రాట్‌లను చీల్చి.స్వింగ్ స్టేట్స్‌లలో మద్ధతు ఇచ్చేలా స్వతంత్రులపై దృష్టి పెడతారని ఫరీద్ పేర్కొన్నారు.ట్రంప్ అన్ని ప్రధాన స్వింగ్ స్టేట్స్‌లో ముందంజలో వున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.అన్ని ఓపీనియన్ పోల్స్, సర్వేల్లో ట్రంప్ తిరిగి విజయం సాధిస్తారని చెబుతున్నట్లుగా ఫరీద్ గుర్తుచేశారు.ఇటీవల ఎఫ్‌టీ మిచిగాన్ రాస్ పోల్ సర్వే( FT-Michigan Ross Poll Survey ) 80 శాతం మంది ఓటర్లు అధిక ధరలే ఆర్ధిక వ్యవస్థకు సవాల్‌గా తెలిపారు.

గత నెలలో (55 శాతం) పోలిస్తే 58 శాతం మంది ఆర్ధిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదన్నారు.

Telugu Cnnjournalist, Cnn Journalist, Donald Trump, Fareed Zakaria, Joe Biden, C

ఆర్ధిక సవాళ్లపై పెరుగుతున్న ఆందోళనల ఆధారంగా ఇమ్మిగ్రేషన్ ఓటర్లు బైడెన్ కంటే ట్రంప్‌ను ఎక్కువగా విశ్వసిస్తున్నారు.మే నెలలో వెలువడిన సర్వేలో 43 శాతం మంది ఓటర్లు ట్రంప్ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తుండగా.గత నెలలో వీరు 41 శాతం మంది వున్నారని సర్వే తెలిపింది.బైడెన్ పట్ల 35 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా.16 శాతం మంది ఓటర్లు తాము ఎవరి వైపు మొగ్గు చూపడంలేదని చెప్పారు.ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధం, అమెరికన్ యూనివర్సిటీలలో ఆందోళనలు డెమొక్రాట్ల మధ్య చిచ్చు రాజేసింది.బెర్నీ శాండర్స్ తన ప్రభుత్వం నిరసనలను అణిచివేస్తున్న నేపథ్యంలో పాలస్తీనియన్ అనుకూల మద్ధతుదారులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు.

రిపబ్లికన్లు ట్రంప్‌కు చాలా బలంగా నిలుస్తున్నారని ఫరీద్ అన్నారు.ట్రంప్‌ కేసులపైనా ఆయన స్పందిస్తూ.మాజీ అధ్యక్షుడిపై తప్పుడు అభియోగాలు మోపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube