టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తరచూ ఎవరో ఒకరిపై సంచలన ట్వీట్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఆర్జీవి.
కేవలం సినిమాలకు సంబంధించిన వ్యవహారాలలో మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలలో కూడా తలదూరుస్తూ ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.ఇలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటారు రాంగోపాల్ వర్మ.
ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం ఏమీ లేకుండా తను అనుకున్నది నిర్మొహమాటంగా మాట్లాడేస్తూ ఉంటారు వర్మ.
తాజాగా కూడా అలాగే సెక్స్ లైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒక ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడిన మాటలు ప్రస్తుతం వీడియోలో వైరల్ గా మారాయి.ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.
నటీ, నటుడు మధ్య రొమాంటిక్ సీన్లు( Romantic Scenes ) చేసేటప్పుడు అమ్మాయిలు మూడ్‌ను బట్టి ఇష్టాన్ని బట్టి ఆ సీన్ చేయాలా? వద్దా అనేది ఆధారపడి ఉంటుంది.ఒక్కో మనిషికి చాలా తేడా ఉంటుంది.
కాబట్టి అందర్నీ ఒకేలా చూడలేం.యాక్టర్ల మధ్య ఉండే వేవ్ లెంగ్త్ బట్టి ఆ సీన్ ఎలా పండుతుందనేది ఆధారపడి ఉంటుంది అని వర్మ తెలిపారు.
నాకు ఒక అమ్మాయితో అఫైర్ ఉండేది.
నాతో శృంగారం చేసిన తర్వాత పక్కకు వెళ్లి బుక్ చదువుకొనేది.శారీరక సుఖం పొందిన తర్వాత ఆ మూడ్ నుంచి బయటపడటానికి పుస్తకం చదువుతుంది.శృంగారంలో ఆ పని అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించకుండా మరో విషయంపై దృష్టిపెట్టడానికి ఆలోచించడం నాకు షాక్ కలిగించేంది అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నీతో నాకు పని అయిపోయింది అనే మూడ్‌లో ఆ అమ్మాయి కనిపించేది.సాధారణంగా ఇలాంటి అలవాటు మగవాళ్లలో ఉంటుంది.ఒక అమ్మాయి అలా చేయడం నాకు మంచి కిక్ ఇచ్చేది.శృంగారానికి ముందు చాలా మంది అబ్బాయిలు మాట్లాడుతారు.
సెక్స్ తర్వాత అమ్మాయిలు మాట్లాడుతుంటారు.కానీ నాకు అఫైర్ ఉన్న అమ్మాయి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించేది అని వర్మ తెలిపారు.