అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District ) ముమ్మడివరం నియోజకవర్గం పల్లంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.పల్లంలో టీడీపీ,( TDP ) వైసీపీ( YCP ) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఇరు వర్గాల మధ్య వివాదం ముదరడంతో ఇటుక రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు.ఈ దాడి ఘటనలో ఇంటి అద్దాలు ధ్వంసం అయ్యాయి.అదేవిధంగా ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఇరు పార్టీలకు చెందిన క్యాడర్ ను చెదరగొట్టారు.







