టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య( Balakrishna ) కెరీర్ పరంగా, రాజకీయాల్లో సక్సెస్ కావడంలో ఆయన భార్య వసుంధర( Vasundhara ) పాత్ర ఎంతో ఉంది.బాలయ్యకు సినిమాల పరంగా భారీ విజయాలు దక్కుతుండగా పొలిటికల్ గా కూడా హ్యాట్రిక్ దక్కుతుందని బాలయ్య ఫీలవుతున్నారు.
ఒక సందర్భంలో బాలయ్య తన భార్య వసుంధర గొప్పదనం గురించి చెప్పగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.
బాలయ్య పెళ్లికి ముందే ఒక ఫంక్షన్ లో వసుంధరను చూసి ఇష్టపడ్డారట.
వసుంధర తన భార్య అయితే బాగుంటుందని ఫీలయ్యారట.పెళ్లి చూపుల్లో వసుంధరను చూసి షాకైన బాలయ్య ఆమెను పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్నారు.
తాను కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్న వసుంధర పిల్లల విషయంలో ఎంతో కేర్ తీసుకుని వాళ్లను పెంచి పెద్ద చేశారని బాలయ్య వెల్లడించారు.
నన్ను అర్థం చేసుకునే భార్య దొరికిందని బాలయ్య వెల్లడించగా ఆ విషయాలు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై( Pan India Movies ) ఫోకస్ పెట్టిన బాలయ్య పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో క్రేజీ హిట్లను అందుకుంటనాని నమ్మకంతో ఉన్నారు.బాలయ్య క్రేజ్ పరంగా కూడా చాలామంది సీనియర్ హీరోలతో పోలిస్తే టాప్ లో ఉండటం గమనార్హం.
స్టార్ హీరో బాలకృష్ణ 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటుండగా ఇతర భాషల్లో సైతం బాలయ్యకు క్రేజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులపై బాలయ్య ఫోకస్ పెడుతున్నారు.బాలయ్య బాబీ సినిమా తర్వాత బోయపాటి శ్రీను( Boyapati Srinu ) సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.గ్యాప్ లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బాలయ్య అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.