ఈ మ్యాజికల్ డ్రింక్ ను నెలరోజుల పాటు వరుసగా తాగారంటే కొలెస్ట్రాల్ మొత్తం కరగాల్సిందే!

ఇటీవల కాలంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.కొలెస్ట్రాల్( Cholesterol ) అనేది రెండు రకాలుగా ఉంటుంది.

 This Magical Drink Helps To Melt High Cholesterol Details, Magical Drink, High-TeluguStop.com

ఒకటి మంచి కొలెస్ట్రాల్( HDL ) కాగా.రెండవది చెడు కొలెస్ట్రాల్( LDL ).మంచి కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు.కానీ చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు తలెత్తుతాయి.

ఊబకాయం వస్తుంది.హై బీపీ, ఆర్థరైటిస్, టైప్ 2 డయాబెటిస్ వంటి అనేక ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అందుకే చెడు కొలెస్ట్రాల్ ను కరిగించుకోవడం చాలా అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ డ్రింక్ చాలా ఉత్తమం గా సహాయపడుతుంది.నెల రోజుల పాటు వరుసగా ఈ డ్రింక్ ను తాగారంటే కొలెస్ట్రాల్ మొత్తం దెబ్బకు కరిగిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Cholesterol, Cinnamon, Hdl Cholestrol, Tips, Latest, Ldl Cholestrol, Lemo

ముందుగా ఒక నిమ్మ పండును( Lemon ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న నిమ్మ పండు ముక్కలు, రెండు అంగుళాల దాల్చిన చెక్క‌,( Cinnamon ) రెండు యాలకులు వేసుకొని పది నుంచి పన్నెండు నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఆ తర్వాత కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Telugu Cholesterol, Cinnamon, Hdl Cholestrol, Tips, Latest, Ldl Cholestrol, Lemo

ఇప్పుడు ఈ వాటర్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుంటే మన డ్రింక్ సిద్ధం అయినట్టే.ఈ మ్యాజికల్ డ్రింక్ ను నిత్యం ఉద‌యం కనుక తీసుకున్నారంటే రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది.అదే సమయంలో పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సైతం క్రమంగా మాయం అవుతుంది.ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్‌ తగ్గుతుంది.

ఊబకాయం నుంచి బయటపడతారు.వెయిట్ లాస్ అవుతారు.

మధుమేహం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.అలాగే ఈ డ్రింక్ ను నిత్యం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

జలుబు, దగ్గు వంటి సీజనల్ సమస్యలు ఉంటే త్వరగా అవి నయమవుతాయి.కాబట్టి అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు ఊబకాయం బారిన పడ్డవారు తప్పకుండా ఈ మ్యాజికల్ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube