ప్రస్తుతం ప్రభాస్ ( Prabhas )పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇక ఇప్పటివరకు ఆయనను బీట్ చేసే మరొక హీరో లేడనే చెప్పాలి.
ఎందుకు అంటే ఆయన చేసిన సినిమాల్లో దాదాపు నాలుగు సినిమాలు 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టాయి.ఇండియా లోనే ఇలాంటి ఒక రికార్డు ను సాధించిన మరొక హీరో లేకపోవడం విశేషం…
ఇక అందులో భాగంగానే బాహుబలి సినిమాతో ( Baahubali movie )దాదాపు 2000 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టిన ఏకైక హీరోగా కూడా ప్రభాస్ నిలవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపూడి( Prabhas Hanu Raghavapudi ) డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చారు.కాబట్టి ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిమీద కూడా చాలా రకాల చర్చలైతే జరుగుతున్నాయి.
ఇక ఇప్పటికే ఈ సినిమాలో కొత్త హీరోయిన్ ను తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారట.అయితే సినిమా ప్రొడ్యూసర్స్ మాత్రం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లను తీసుకుందామనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే కల్కి సినిమాలో ( Kalki movie )ప్రభాస్ తో దీపిక పదుకునే( Deepika Padukone ) నటిస్తుంది.
కాబట్టి ఆమె కాకుండా వేరే హీరోయిన్ ఎవరినైనా తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఈ సినిమా యూనిట్ లోని కొంతమంది మాత్రం ఈ సినిమాలో కృతి సనన్ అయ్యితే ప్రభాస్ కి బాగా సెట్ అవుతుందని తనను కనక ఈ సినిమాలో తీసుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుందని మరి కొందరు అభిప్రాయ పడుతున్నారు.ఇక ఇప్పటివరకైతే ఇంకా హీరోయిన్ విషయంలో క్లారిటీ అయితే రాలేదు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారనేది ఫైనలైజ్ అయితే కాలేదు.కాబట్టి ఇకమీదట ఈ సినిమాలోకి బాలీవుడ్ హీరోయిన్ లలో ఎవరిని ఒక్కరిని తీసుకునే అవకాశం అయితే ఉంది.
లేదు అంటే కొత్త హీరోయిన్ ని తీసుకువచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…