ఏపీలో వైఎస్ జగన్( YS Jagan ) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాష్ట్ర విద్యారంగంలో కీలక సంస్కరణలు చోటు చేసుకున్నాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యావ్యవస్థలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు.
పోటీ సమాజంలో వెనుకంజలో ఉండకూడదని భావించిన సీఎం జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు.అంతేకాదు దేశంలో ఎక్కడా లేని రీతిలో ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ‘ఇంటర్నేషనల్ బాకలారియెట్’ సిలబస్ ను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు.
దీని ద్వారా ఏపీలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడి విజయం సాధించే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నారు.
పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ బోధనా పద్ధతుల్లో తీరు తెన్నులను మార్చేశారు.నాడు -నేడు పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ఆధునీకరించారు.అంతేకాదు పేదవారికి ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం టోఫెల్ శిక్షణను సైతం అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే పేదల పిల్లలను అంతర్జాతీయ స్థాయికి చేరుస్తున్నారు.దీంతో పలు అంతర్జాతీయ వేదికలు, ఐక్యరరాజ్య సమితి సమావేశాలతో పాటు పలు వేదికలపై ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు( Government school students ) ప్రతిభను కనబరుస్తున్నారు.
ఇప్పటికే విదేశాల్లో ప్రతిభను కనబర్చిన ఏపీ విద్యార్థులు తాజాగా అంతర్జాతీయ స్థాయి టోఫెల్ పరీక్ష( TOEFL exam )కు ఏపీ నుంచి లక్షల మంది విద్యార్థులు హాజరు కావడమే కాదు తమ ప్రతిభను కనబరిచారు.సుమారు 13, 104 స్కూళ్లల్లో 3, 4 మరియు 5వ తరగతి చదువుతున్న దాదాపు 4,53,265 మంది విద్యార్థులు ఈ టోఫెల్ పరీక్షకు హాజరయ్యారు.అదేవిధంగా దీని తరువాత స్థాయిలో నిర్వహించే పరీక్షకు 5,907 స్కూళ్లకు చెందిన 6, 7, 8 మరియు 9వ తరగతి విద్యార్థులు హాజరవుతారు.ఇందులో భాగంగా ఈ నెల 12న జరగనున్న పరీక్షకు 16.5 లక్షల మంది విద్యార్థులు హాజరు అవుతారని ప్రభుత్వం వెల్లడించింది.కాగా ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో మెరుగుపరిచిన విద్యాబోధన, ఆంగ్లం మీద పట్టుకోసం జగన్ ప్రభుత్వం పడుతున్న తపన, చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర విద్యాశాఖ పేర్కొంది.
ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రపంచ ప్రమాణాలకు అనుసంధానం చేయడంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.