ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట( Nizamsagar canal embankmen ) తెగిపోయింది.దీంతో ఆర్మూర్( Armor ) పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీలోకి నీరు భారీగా వచ్చి చేరింది.
తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ జలమయం అయింది.ఈ క్రమంలో ఇళ్లల్లోకి నీరు వచ్చి చేరడంతో తీవ్ర భయాందోళనకు గురైన కాలనీవాసులు బయటకు పరుగులు తీశారు.
అయితే కెనాల్ కట్ట తెగిపోవడానికి ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.