నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలో నిర్మించిన జ్యోతిరావు ఫూలే భవన్(బీసీ భవన్) నిర్మాణం పూర్తి చేసుకొని నెలలు గడిచినా ఓపెనింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుంకు శ్రీనివాస్,చేగొండి మురళి అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లడుతూ బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేసి చాలా కాలమైనా ఎందుకు ఓపెనింగ్ చేయట్లేదని, దానికి కారణం ఏమిటని ప్రశ్నించారు.
పలుమార్లు అధికారులకు, స్థానిక ఎమ్మెల్యేకు విన్నవించుకున్నా ఫలితం లేదని వాపోయారు.ఓపెనింగ్ చేయకపోడం వల్ల భవనం నిరుపయోగంగా మారి బూజు పడుతుందని,తక్షణమే ఎమ్మేల్యే చొరవ తీసుకుని జ్యోతిరావు ఫూలే భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరారు.
ఇలాగే ఆలస్యం చేస్తే తమ సంఘం ఆధ్వర్యంలో అన్ని బీసీ సంఘాల కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఆ కార్యక్రమాలకు బీసీ సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు.