Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. కస్టడీకి ఇద్దరు అడిషనల్ ఎస్పీలు..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) పోలీసుల దర్యాప్తు శరవేగంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగ రావు,( Bhujanga Rao ) తిరుపతన్నను( Tirupatanna ) పోలీసులు ఇవాళ కస్టడీలోకి తీసుకోనున్నారు.

కాగా ఈ కేసులో వీరిద్దరినీ ఐదు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు( Nampally Court ) అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.అదేవిధంగా ప్రణీత్ రావును మరోసారి ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా న్యాయస్థానం నిరాకరించింది.

ఈ క్రమంలోనే ప్రణీత్ రావు కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ డీసీపీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య నాలుగుకు చేరింది.ఈ క్రమంలోనే రాధాకిషన్ ను పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు.

Advertisement

కాగా రాధాకిషన్ రావుతో పాటు గట్టుమల్లును నిన్న వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ అర్థరాత్రి వరకు ప్రశ్నించారు.కాగా ఈ కేసులో పలువురు టాస్క్ ఫోర్స్, ఎస్ఐబీ సిబ్బంది బంజారాహిల్స్ లో పోలీసుల విచారణకు హాజరవుతున్నారు.

గెలుపు కోసం ఒవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు .. : బీజేపీ అభ్యర్థి మాధవీలత
Advertisement

తాజా వార్తలు