పార్టీ మారుతున్న నేతలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అసాధ్యం అనుకున్న తెలంగాణను కేసీఆర్ సాధించారని తెలిపారు.
కేసీఆర్ ఎన్నో అవమానాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించారని పేర్కొన్నారు.ఈ క్రమంలో కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో కేసీఆర్ ను దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారని తెలిపారు.
కేసీఆర్( KCR ) ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని వెల్లడించారు.కొత్తతరం నాయకత్వాన్ని తయారు చేస్తామన్న కేటీఆర్ పోరాట పంథాలో కదం తొక్కుదామంటూ ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్( KTR Tweet ) రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.