పల్లె దవాఖానా విధులకు డాక్టర్ డుమ్మా: ఎరుకల వెంకటేష్ గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా:తుర్కపల్లి మండలం( Turkapally ) వేల్పుపల్లి గ్రామంలోని పల్లె దవాఖానకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని, ఇక్కడ విధులు నిర్వహించే డాక్టర్ సూర్య ప్రకాష్ విధులకు హాజరు కాకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్( Venkatesh Goud Arukala ) ఆరోపించారు.

పల్లెలో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన పల్లె దవాఖాన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని వాపోయారు.

సబ్ సెంటర్లో వైద్యం అందించాల్సిన డాక్టర్ సూర్యప్రకాష్( Dr.Suryaprakash ) నిత్యం విధులకు హజరు కావడం లేదని,ఎప్పుడు చూసినా దవాకానాకు తాళం వేసే ఉంటుందన్నారు.వివిధ రకాల అనారోగ్య సమస్యలతో ఇక్కడికి వచ్చే రోగులకు కనీసం మందు గోలి ఇచ్చే నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.

అయినా సంబధిత అధికారులు చోద్యం చూస్తున్నారని, అంతేకాకుండా మండలంలోని మిగతా పల్లె దవాఖానల్లో డాక్టర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు.ఇప్పటికైనా జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లపై విచారణ జరిపి తక్షణమే చర్యలు చేపట్టి,పల్లెల్లోని పల్లె దవాఖానల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అందరూ కలిసి సమిష్టిగా అన్నదాతకు అన్యాయం
Advertisement

Latest Suryapet News