Laya Chiranjeevi : చిరంజీవి నాకు ఎలాంటి సహాయం చేయలేదు.. వైరల్ అవుతున్న లయ కామెంట్స్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించినటువంటి వారిలో లయ( Laya ) ఒకరు.ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా అద్భుతమైనటువంటి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన లయ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.

 Chiranjeevi Not Helped Me Laya Comments Goes Viral-TeluguStop.com

ఇలా వృత్తిపరంగా వైద్యరంగంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని ఈమె విదేశాలలో స్థిరపడ్డారు.

Telugu Chiranjeevi, Laya, Tollywood-Movie

ఇలా విదేశాలలో స్థిరపడినటువంటి లయ సినిమాలకు కూడా దూరమయ్యారు.అయితే ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ సోషల్ మీడియాలో( Social Media ) తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ముఖ్యంగా తాను చిరంజీవి గారిని( Chiranjeevi ) సహాయం అడిగితే చిరంజీవి గారు తనకు సహాయం చేయలేదంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ వార్తలపై లయ స్పందించారు.

Telugu Chiranjeevi, Laya, Tollywood-Movie

ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ.నాన్న డాక్టర్ కావడంతో చిన్నప్పటినుంచి నాకు ఎలాంటి అవసరం వచ్చిన నాన్న అవసరాలన్నింటిని తీర్చేవారు అయితే ఇప్పటికి తాను ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నానని లయ తెలిపారు.ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నేను ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని అందుకోసమే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గారిని సహాయం అడిగిన చేయలేదు అంటూ వార్తలు రాశారు.

ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.చిరంజీవి గారు ఎంతోమందికి సహాయం చేస్తారు.కానీ నాకు తన వద్ద సహాయం తీసుకునే పరిస్థితి రాలేదని నేను అతనిని సహాయం అడగలేదు అంటూ ఈ సందర్భంగా లయ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube