ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి జ్యోతి( Tribal Welfare Officer Jyothi ) కి కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.ఈ మేరకు వచ్చే నెల 6వ తేదీ వరకు పద్నాలుగు రోజులపాటు ఏసీబీ కోర్టు( ACB Court ) రిమాండ్ విధించింది.
ఉస్మానియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత జ్యోతిని అధికారులు కోర్టు ఎదుట హాజరు పరిచారు.ఈ క్రమంలో రిమాండ్ ఆపాలని జ్యోతి తరపు న్యాయవాది కోర్టును కోరారు.
అలాగే ఆమెను అరెస్ట్ చేసి 24గంటలు దాటిందని చెప్పారు.
అయితే జ్యోతి అరెస్ట్ కు కోర్టు అనుమతి తీసుకున్నారని తెలిపిన న్యాయమూర్తి 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్( 14 Days Judicial Remand ) విధించారు.ఈ నేపథ్యంలో మార్చి 6వరకు రిమాండ్ విధించడంతో ఆమెను చంచల్ గూడ జైలుకు తరలించారు.అయితే ట్రైబల్ వేల్ఫేర్ అధికారిణి అయిన జ్యోతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే.