ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెంచడం కూడా సులువు కాదనే సంగతి తెలిసిందే.పిల్లల విషయంలో ప్రతి క్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.
పిల్లల్ని కంటికి రెప్పగా చూసుకోవాలి.అయితే మానసిక సమస్యలు ఉన్న పిల్లలను పెంచే విషయంలో మరిన్ని ఎక్కువ సవాళ్లు ఉంటాయి.
అయితే అలాంటి స్పెషల్ చిల్డ్రన్ కోసం 40 సంవత్సరాలుగా కష్టపడుతూ వల్లి టీచర్( Valli Teacher ) ప్రశంసలు అందుకుంటున్నారు.
కల్మషం తెలియని స్పెషల్ కిడ్స్ కు పాఠాలు చెబుతూ ఎంతోమంది పిల్లలకు తల్లిగా మారి వల్లి సుధీర్ ప్రేమను పంచుతున్నారు.
స్పెషల్ కిడ్స్ కు( Special Kids ) సేవ చేయడం కోసమే వల్లి టీచర్ తన జీవితాన్ని అంకితం చేయడం గమనార్హం.తాను స్పెషల్ టీచర్ కావడం వెనుక ఎన్నో మలుపులు ఉన్నాయని వల్లి సుధీర్ చెబుతున్నారు.
తమ కుటుంబం తెలుగు కుటుంబమే అయినా చెన్నైలో చదువుకున్నానని వల్లి సుధీర్ వెల్లడించారు.

నాలుగేళ్ల వయస్సులోనే నాన్న మరణించాడని తల్లీదండ్రులకు నేను ఏకైక సంతానం అని వల్లి సుధీర్( Valli Sudheer ) చెప్పుకొచ్చారు.స్పెషల్ చిల్డ్రన్ కోసం పని చేయాలని నిర్ణయం తీసుకున్న సమయంలో ఇందులో ఇమడలేనని అనుకున్నానని తర్వాత మణిపాల్ లో శిక్షణ తీసుకున్నానని ఆమె తెలిపారు.ఆ సమయంలో నా చివరి ఊపిరి వరకు స్పెషల్ కిడ్స్ కు సేవ చేస్తానని నిర్ణయం తీసుకున్నానని వల్లి సుధీర్ కామెంట్లు చేశారు.

స్పెషల్ చిల్డ్రన్ కోసం హైదరాబాద్ లో శ్రద్ధ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ ను( Shraddha Centre For Special Children ) స్థాపించానని ఆమె చెప్పుకొచ్చారు.పిల్లలకు పర్సనల్ నీడ్స్, డొమెస్టిక్ స్కిల్స్, కాగ్నిటివ్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చానని వల్లి సుధీర్ కామెంట్లు చేశారు.ఎన్నో ఇబ్బందులు ఎదురైనా నేను నా వంతు కష్టపడుతూనే ఉన్నానని ఆమె చెబుతున్నారు.వల్లీ సుధీర్ మంచి మనస్సు గురించి తెలిసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







