పిల్లులు( Cats ) చాలా తెలివైనవి మాత్రమే కావు, అవి చాలా ఫన్నీగా కూడా ఉంటాయి.చిలిపి చేష్టలు చేస్తూ ఇవి యజమానులకు ఎల్లప్పుడూ వినోదాన్ని పంచుతుంటాయి.
ఇవి చేసే కొన్ని పనులు చూస్తే కడుపుబ్బ నవ్వుకోక తప్పదు.అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.
తాజాగా వాటన్నిటికీ మించిన ఒక హిలేరియస్ వీడియో( Hilarious Video ) ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.వైరల్ అవుతున్న ఆ వీడియోలో మనం ఒక మనిషి చేయిని, అలాగే పిల్లి ముందర కాలును చూడవచ్చు.
వీరిద్దరి మధ్య ఒక తలుపు లాంటి చెక్క ఉంది.ఆ చెక్క కింద కాస్త గ్యాప్ ఉంది.
అయితే ఆ గ్యాపు నుంచి ఒక పెట్ ఫుడ్ బాక్స్( Pet Food Box ) ను మనిషి లాగుతూ ఉంటే, పిల్లి అది నాకు చెందిన ఆహారం అంటూ తన కాలుతో వెనక్కి తీసుకుంటుంది.

అలా వీరిద్దరూ ఆహార పెట్టెను అటు జరుపుతూ, ఇటు జరుపుతూ చాలాసేపు ఒక ఆట ఆడుతున్నారు.దీనిని మరొకరు వీడియో తీశారు.ఈ వీడియోలో పిల్లి తన కాలును ఒక మనిషి లాగానే ఉపయోగిస్తూ తన వైపు తీసుకోవడం భలే ఫన్నీగా( Funny ) అనిపించింది.
ఈ ఫుడ్ బాక్స్ ఒక రేకు డబ్బాలా ఉంది.దానిని ఓపెన్ చేయగా పైన ఒక రేకు పైకి వచ్చింది.అది బాక్స్ పూర్తిగా పిల్లి వైపు పోకుండా చేస్తుంది.అందువల్ల మనిషి దానిని మళ్లీ వెనక్కి తీసుకోగలుగుతున్నాడు.

ఇదంతా చూసేందుకు హిలేరియస్‌గా అనిపించింది.ప్రముఖ ట్విట్టర్ పేజీ @Buitengebieden ఈ వీడియోను పంచుకుంది.ఇప్పటికే ఈ వీడియోకు 97 లక్షల వ్యూస్ వచ్చాయి.లక్షా 20 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.







