కష్టాలు( Problems ) వచ్చినప్పుడే మనిషికి తనలో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుంది.కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు.
కష్టాన్ని నమ్ముకున్న వారందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించిన విషయం అందరికీ తెలుసు.ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే కుర్రాడు కూడా కష్టాన్ని నమ్ముకొని సక్సెస్ ని అందుకున్నాడు.
ఆ వివరాలెంటో, ఆ 19 ఏళ్ల కుర్రాడి కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ కుర్రాడి స్ఫూర్తిదయకమైన కథ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో చాలామందికి ఇన్స్పిరేషన్గా( Inspiration ), ఆకర్షణీయంగా నిలుస్తుంది.
కోల్కత్తాకు చెందిన ఒక 19 ఏళ్ల కుర్రాడు సాగర్ కొన్ని నెలల క్రితం తన తల్లిదండ్రులను కోల్పోయాడు.

ఆ బాధతో అతను కుంగిపోకుండా తన తండ్రి కలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నాడు.తన తండ్రి ఎంతో ఇష్టంగా నడిపిన రెస్టారెంట్ మూతపడింది.దానిని తిరిగి ప్రారంభించడం కోసం కృషిచేస్తున్నాడు.
ప్రస్తుతం సాగర్ తన స్ఫూర్తిదాయకమైన కథనాన్ని పంచుకోగా అది ఇన్స్టాగ్రామ్( Instagram )లో ఎంతోమందిని ఆకట్టుకుంటుంది.వైరల్ అవుతున్న వీడియోలో సాగర్ స్వయంగా వంట వండటం, గిన్నెలు కడగడం మనం చూడొచ్చు.
ఒకవైపు రెస్టారెంట్ పనులు చూసుకుంటూనే మరోవైపు తన చెల్లి బాగోగులు చూసుకుంటున్నాడు.

ఇక కాస్త ఖాళీ సమయం దొరికితే కంప్యూటర్( Computer ) నేర్చుకోవడానికి వెళుతుంటాడని సమాచారం.ఒకసారి బెంగాలీ నటి స్వస్తిక ముఖర్జీ సాగర్ వండిన భోజనం తిని అతని నైపుణ్యానికి ముగ్ధురాలయ్యింది.సాగర్ తో ఫోటో కూడా దిగింది అని సమాచారం.
ఆ ఫోటో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.దాంతో సాగర్ ప్రతిభను ఎంతోమంది మెచ్చుకున్నారు.
ఈ వీడియో మిలియన్లకు పైగా వ్యూస్ ని కామెంట్స్ ని సొంతం చేసుకుంది.ఇలాంటి చిన్నపిల్లలను చూసి పెద్దవారు నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని కొందరు కామెంట్లు పెట్టారు.







