ఈరోజు వాలెంటైన్స్ డే( Valentines Day ) అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీలకు సంబంధించి పలు రకాలు వార్తలు వినిపిస్తున్నాయి.
మరి టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం.టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున, అమల( Nagarjuna Amala ) ఇద్దరిదీ ప్రేమ వివాహమే.1992 జూన్ 11న పెద్దల సమక్షంలో అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ప్రేమ యుద్దం, చినబాబు, శివ, నిర్ణయం లాంటి చిత్రాల్లో జంటగా నటించారు.
అలాగే మరో సెలబ్రిటీ జంట జీవిత, రాజశేఖర్.( Jeevita Rajashekar ) మొదట జీవితనే రాజశేఖర్‌కు ప్రపోజ్ చేశారు.

ఆ తర్వాత మూడేళ్లపాటు ప్రేమించుకున్నారు.ఆ తర్వాత కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు.ఒకప్పటి హీరో శ్రీకాంత్, ఊహా( Srikanth Ooha ) లది కూడా ప్రేమ వివాహం.వీరిద్దరూ 1997 జనవరి 20న పెళ్లి చేసుకున్నారు.టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరైన నమ్రత మహేష్ బాబులది( Namrata Mahesh Babu ) కూడా ప్రేమ వివాహం అన్న విషయం తెలిసిందే.2000వ సంవత్సరంలో వంశీ చిత్రంలో మహేశ్ – నమ్రత కలిసి నటించారు.అప్పుడే ప్రేమలో పడ్డారు.దాదాపు ఐదేళ్లపాటు సీక్రెట్‌గా తమ బంధాన్ని కొనసాగస్తూ, ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.అలాగే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిలది( Allu Arjun Sneha Reddy ) కూడా ప్రేమ వివాహమే.ఒక స్నేహితుడి పెళ్లిలో కలుసుకున్న వీరిద్దరూ చివరికి ప్రేమించుకుని 2011లోపెద్దల సమక్షంలో ఒకటయ్యారు.

రామ్ చరణ్ ఉపాసన లది( Ram Charan Upasana ) కూడా ప్రేమ వివాహమే.ఆరెంజ్ సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమ ఐదేళ్లపాటు కొనసాగింది.ఆ తర్వాత 2012లో జూన్ 14న ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారంతో వెళ్లి చేసుకుని ఒకటయ్యారు.లక్ష్మి మంచు-ఆండీ శ్రీనివాసన్ లది కూడా ప్రేమ వివాహం.టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ ప్రేమజంట నాని-అంజనా యలవర్తి.( Nani Anjana Yelavarthy ) నాని భార్య అంజన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.
నాని విశాఖపట్నంలో వీడియో జాకగా ఉన్నప్పుడు అంజనా ఒక పని మీద అతన్ని కలిసింది.ఆ తర్వాత ఫోన్‌లో స్నేహితులుగా మారిన వీరిద్దరు ప్రేమాయణం కొనసాగించారు.

ఐదేళ్లపాటు డేటింగ్ ఉన్నప్పటికీ ఎక్కడా రివీల్ చేయలేదు.ఆ తర్వాత చివరకు 27 అక్టోబర్ 2012న వివాహం చేసుకున్నారు.సమంత నాగచైతన్య లది( Samantha Nagachaitanya ) కూడా ప్రేమ వివాహం అన్న విషయం మనందరికీ తెలిసిందే.కానీ వీరి ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలబడలేదు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి( Varuntej Lavanya Tripati ) కూడా ఇటీవలె లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే.టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గతేడాది వివాహాబంధంలోకి అడుగుపెట్టారు.
భూమా మౌనికతో ప్రేమలో పడ్డారు.కేవలం మీరు మాత్రమే కాకుండా ఇంకా సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వివాహం చేసుకున్న సెలవు చాలా మందే ఉన్నారు.







