రైతులు చేపట్టిన చలో ఢిల్లీ ఆందోళన( Chalo Delhi ) రెండో రోజు కొనసాగుతోంది.డిమాండ్లు సాధించేవరకు విశ్రమించేది లేదని రైతులు చెబుతున్నారు.
రుణమాఫీ, పంటల మద్ధతు ధరకు చట్టబద్ధత, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులకు పెన్షన్ మరియు ఉపాధి హామీ పని దినాలు రెండు వందల రోజులకు పెంచడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు సహా మొత్తం పది డిమాండ్లతో రైతులు నిరసన కార్యక్రమం( Farmers Protest ) చేపట్టారు.రైతుల నిరసన నేపథ్యంలో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అలాగే హర్యానా శంభు సరిహద్దు( Haryana Shambhu Border ) వద్ద పోలీసులు రైతులను అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే ఢిల్లీ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న రైతులపై భద్రతా దళాలు టియర్ గ్యాస్( Tear Gas ) ప్రయోగిస్తున్నాయి.నిన్న పోలీసులు టియర్ గ్యాస్ కాల్పుల్లో సుమారు 60 మంది నిరసనకారులకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది.అదేవిధంగా నిరసనకారుల రాళ్ల దాడిలో పలువురు ఆర్ఏఎఫ్ సిబ్బంది కూడా గాయపడ్డారు.
మరోవైపు రైతులను ఢిల్లీకి వెళ్లనివ్వకుండా అడ్డుకోవడాన్ని సంయుక్తి కిసాన్ మోర్చా ఖండించింది.ఈ నేపథ్యంలోనే కేంద్రం తీరుకు నిరసనగా ఈ నెల 16వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.







