Actor Christian Bale : ఆస్తి రూ.1000 కోట్లు.. వాడేది సెకండ్ హ్యాండ్ కారు.. ఈ ప్రముఖ నటుడు ఎవరో మీకు తెలుసా?

మామూలుగా సెలబ్రిటీలు ఎక్కువ శాతం మంది లగ్జరీ లైఫ్ ( Luxury life )ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు.ధరించే చెప్పుల నుంచి బట్టల వరకు ప్రతి ఒక్కరి కూడా లక్షలు విలువ చేసేవి.

 Superstar With Rs 1000 Crore Net Worth Still Drives 20 Year Old Second Hand Car-TeluguStop.com

ఆభరణాలు చెప్పులు వాచీలు డ్రెస్సులు ఇలా ప్రతి ఒక్కటి కూడా లక్షలు విలువ చేసేవే ధరిస్తూ ఉంటారు.కార్ల విషయానికొస్తే గార్ల ధరలు ఎక్కువగా కోట్లల్లోనే ఉంటాయని చెప్పవచ్చు.

కోట్లు విలువ చేసే కార్లను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.కొందరు సెలబ్రిటీలకు కార్లు అంటే పిచ్చి ప్రేమ కావడంతో వాటికోసం కోట్లు వెచ్చేస్తూ ఉంటారు.

ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతిక్షణాన్ని ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకుంటారని నమ్ముతుంటారు.అయితే సినిమా తారలందరూ అలా ఉండరు.

Telugu Donate, Hand Car, Rscrore, Toyotatacoma-Movie

కొందరు ఎంత సంపాదించినా సామాన్యుల వలె చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.హాలీవుడ్‌లో కూడా ఇలాంటి యాక్టర్స్ ఉన్నారు.ముఖ్యంగా ఒక హాలీవుడ్ స్టార్‌కు భారీ సంపద ఉన్నా, ముందు నుంచి సాధారణ జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఎంతో సింపుల్గా ఒక సాధారణ వ్యక్తుల గడుపుతున్నారు ఒక నటుడు.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.అతను మరెవరో కాదు, హాలీవుడ్ పాపులర్ యాక్టర్ క్రిస్టియన్ బాలే( Actor Christian Bale ).డార్క్ నైట్ ట్రైలాజీ, టెర్మినేటర్ సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించాడు.త్వరలోనే రానున్న థోర్ లవ్ అండ్ థండర్ ( Thor Love and Thunder ) సినిమాలో కనిపించనున్నాడు.

క్రిస్టియన్ బాలే ప్రపంచంలోని అత్యంత సంపన్న నటులలో ఒకరు.

Telugu Donate, Hand Car, Rscrore, Toyotatacoma-Movie

2023 నాటికి ఆయన సంపద 120 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీలో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ.ఇంత ఆస్తి ఉన్నా సరే క్రిస్టియన్ ఫ్యాన్సీ కార్ల కోసం డబ్బును ఖర్చు చేయడు.

ఈ నటుడు 2003 టయోటా టాకోమా పికప్( Toyota Tacoma Pickup ) ట్రక్కును ఇప్పటికీ వాడతాడు.నిజానికి ఈ ట్రక్కుని కూడా ఎవరో అమ్మితే సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేశాడు.

దాన్ని 13 ఏళ్లుగా నడుపుతూనే ఉన్నాడు.ఈ ట్రక్కును ఇప్పటికీ ఎందుకు వాడుతున్నారని, దానిలో అంత స్పెషల్ ఏముందని ఓ ఇంటర్వ్యూలో బాలేను అడిగారు.

ఈ ట్రక్కు అంటే తనకు చాలా ఇష్టమని, అది ప్రాక్టికల్‌గా ఉంటుందని, స్నేహితులకు ఉపయోగపడుతుందని అతడు చెప్పాడు.ఒక్కసారి ఈ పికప్ ట్రక్కులో బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాదని కూడా చెప్పాడు.

ఈ హాలీవుడ్ నటుడు లాస్ ఏంజెల్స్ నగరాన్ని ఈ ట్రక్కులోనే చుట్టేస్తాడు.ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పెద్ద స్టార్ అయినా సరే సొంత పనులు చేసుకోవడానికి ఇష్టపడతాడు.

చివరికి ట్రక్కులో తానే స్వయంగా గ్యాస్ రీఫిల్ చేస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube