కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ట్విట్టర్ వేదికగామరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అసెంబ్లీ సమావేశాల్లో నీటి పారుదల ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government ) శ్వేతపత్రం విడుదల చేస్తుండగా కేటీఆర్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.
ఛలో నల్గొండ( Chalo Nalgonda ) సభ ఒత్తిడి వలనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలోనే కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ప్రభుత్వం అప్పగించడం లేదని సభలో తీర్మానం చేయబోతున్నారని తెలిపారు.తమ ఒత్తిడి వలనే కాంగ్రెస్ సర్కార్ ఈ తీర్మానం ప్రవేశపెట్టబోతుందని ఆయన స్పష్టం చేశారు.ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని కేటీఆర్ వెల్లడించారు.