శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai District )లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆటోను సిమెంట్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.అలాగే ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదం అగలి మండలం ఇరిగేపల్లి( Irigepalli )లో చోటు చేసుకుంది.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కేసు నమోదు చేసి ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.