Instagram: ఇన్ స్టాగ్రామ్ లో మరో ప్రైవసీ ఫీచర్.. ఇంతకి ఆ ఫీచర్ ఏంటంటే..?

ఇన్ స్టాగ్రామ్( Instagram ) తమ వినియోగదారుల ప్రైవసీ కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటుంది.దీంతో ప్రైవసీకి( Privacy ) పెట్టింది పేరుగా ఇన్ స్టాగ్రామ్ కు ఆదరణ పొందుతోంది.

 What Is The Flipside Privacy Feature On Instagram-TeluguStop.com

అయితే ఇన్ స్టాగ్రామ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రైవసీ ఫీచర్ ను త్వరలోనే తమ యూజర్లకు పరిచయం చేయనుంది.ఇంతకీ ఆ ప్రైవసీ ఫీచర్ ఏమిటో.

ఆ ప్రైవసీ ఫీచర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్టులు, స్టోరీలు ఇకపై ఎంపిక చేసిన వారికి మాత్రమే కనిపించేలా చేయడం కోసమే కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది.

ఫ్లిప్ సైడ్( Flipside ) పేరుతో ఓ సరికొత్త ప్రైవసీ ఫీచర్ ను తమ యూజర్లకు త్వరలోనే పరిచయం చేస్తున్నట్లు సంస్థ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు.

ఈ ఫ్లిప్ సైడ్ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.టెస్టింగ్ దశ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.ఈ ఫీచర్ తో ప్రస్తుత ప్రొఫైల్ ప్రత్యామ్నాయ అకౌంటుగా మారుతుంది.

ఈ అకౌంట్ ప్రాథమిక ఖాతాతో లింక్ అయి ఉంటుంది.

ఇన్ స్టాగ్రామ్ యూజర్లు తమకు నచ్చిన పేరు, బయోడేటా, ఫోటో తో వ్యక్తిగతీకరించిన ప్రొఫైల్ లను సృష్టించుకోవచ్చు.ఈ ప్రొఫైల్ లో యూజర్లు ఏదైనా పోస్ట్,( Post ) రీల్,( Reel ) స్టోరీ తమకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా షేర్ చేసుకోవచ్చు.

ఫ్లిప్ సైడ్ ప్రైవసీ ఫీచర్ ఎలాంటి వినియోగదారులకు ఉపయోగపడుతుంది అంటే.

తాము పోస్ట్ చేసే కంటెంట్ ను కేవలం కొందరు మాత్రమే చూడాలి అనుకునే వారికి ఉపయోగపడుతుంది.అయితే ఎప్పుడు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందో చెప్పలేదు కానీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఇన్ స్టాగ్రామ్ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube