తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఆయన కాంగ్రెస్ పాలనలో కర్ణాటక దివాళా తీసిందని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు కేవలం ప్రచారంలోనే కనిపిస్తారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.కర్ణాటకలో ఉన్న పథకాలకు కోత పెడుతున్నారన్నారు.
కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు.ఈ క్రమంలో తెలంగాణలో మళ్లీ రైతు ఆత్మహత్యలు కావాలా అని ప్రశ్నించారు.
కర్ణాటక కు వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ మనకు అవసరమా అని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు దమ్ముంటే కర్ణాటక పేరు చెప్పి ఇక్కడ ఓటు అడగాలని సవాల్ చేశారు.







