కెరియర్ ఎండింగ్ అవుతుంది అన్న సందేహంలో ఉన్న కాజల్ ఇప్పుడు జనతా గ్యారేజ్ లో ఐటం సాంగ్ తో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించింది.తెలుగులో హీరోయిన్ గా ఏమో కాని ఐటం గాళ్ గా మాత్రం అమ్మడికి మంచి అవకాశాలే వచ్చేట్టు ఉంది.
జనతాలో కాజల్ ఐటం అనగానే బాబోయ్ ఫేడవుట్ భామతో ఏం ఐటం సాంగ్ అనుకున్నారంతా కాని పక్కా లోకల్ సాంగ్ చూసి నిజంగానే బాబోయ్ కాజల్ లో ఇంత సరుకుందా అని ముక్కున వేలేసుకున్నారు.అసలు ఆ సాంగ్ లో జూనియర్ కు పోటీ పోటీగా అటు అందంతో పాటుగా స్టెప్పులతో కూడా హోరెత్తించింది కాజల్.
ఇప్పుడు కాజల్ కు తెలుగులో అలాంటి ఐటం సాంగ్ ఆఫర్లే వస్తున్నాయట.జనతా గ్యారేజ్ లో కేవలం 50 లక్షలకే ఐటాం సాంగ్ చేసిన కాజల్ ఆ రెమ్యునరేషన్ కు డబుల్ ఇస్తామని అంటున్నారట.
కాజల్ మాత్రం వచ్చిన ప్రతిది చేసే ఆలోచనలో లేదు.తనకు నచ్చి అందులో తన సాంగ్ ఏమేరకు సక్సెస్ అవుతుంది అన్ని సమపాళ్లలో చూసుకుని సై అనేస్తుందట.
మొత్తానికి ఇన్నాళ్ల కెరియర్ లో మొదటి ఐటం సాంగ్ తో కేక పెట్టించిన కాజల్ అసలు అమ్మడు ఐటంగా ఈ రేంజ్ లో సూట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు.టాప్ హీరోయిన్స్ శృతి, తమన్నాలు ఐటం సాంగ్స్ చేసిన కాజల్ లా మెరుపులు మెరిపించ లేదనే చెప్పాలి.