కాజల్ అగర్వాల్ చీరకడితే ఎలా ఉంటుంది? చీరకే అందం వచ్చేస్తుందని చెబితే రొటీన్ కాబట్టి, అందానికే అందం వచ్చినట్టు ఉంటుంది అని చెప్పడం కరెక్ట్ ఏమో ! అయినా ఇప్పుడు కాజల్ చీర కట్టడం అనే టాపిక్ ఎందుకని అంటారా! దక్షిణాది హీరోయిన్లలో చీరలో అందరికన్నా ఎక్కువ అందంగా, సెక్సిగా కనిపించే హీరోయిన్ కాజల్ అని బాలివుడ్ అభిమానులు అభిప్రాయపడ్డారు.
ప్రముఖ వెబ్ సైట్ బాలివుడ్ లైఫ్ నిర్వహించిన “అల్టిమేట్ దేసి గర్ల్ ఆఫ్ సౌత్” పోల్ లో అత్యధికంగా 31% ఓట్లు దక్కించుకోని హిందీలో కూడా తనకు అభిమానగణం ఉందని నిరూపించుకుంది కాజల్.
ఈ పోల్ లో సమంత, నయనతార, తమన్నా లాంటి వారిని సైతం ఓడించింది కాజల్.ఇక ఆ పోల్ ప్రకారం ఏ సుందరాంగి ఎన్ని ఓట్లతో, ఏ స్థానంలో నిలిచిందంటే …
1) కాజల్ – 31%
2) సమంత – 24%
3) తమన్నా – 17%
4) శ్రియ – 10%
5) నయనతార – 9%
6) శృతిహాసన్ – 7%
7) హన్సిక – 2%