వెంకటేష్( Venkatesh ) హీరోగా మెహర్ రమేష్ ( Meher Ramesh )డైరెక్షన్ లో వచ్చిన షాడో సినిమా భారీ డిజాస్టర్ అయింది ఈ సినిమా ఫ్లాప్ అవడం వెనుక మెహర్ రమేష్ తప్పిదం ఉంది అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఈ సినిమాకి రైటర్ అయిన గోపి మోహన్( Gopi Mohan ) కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు అవి ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గోపి మోహన్ కోన వెంకట్( Kona Venkat ) ఇద్దరు కూడా శ్రీనువైట్లకి ఆస్థాన రైటర్లుగా చాలా సినిమాలకి కథ, మాటలని అందించారు.వీళ్లు ఇద్దరు కలిసి షాడో సినిమాకి( Shadow movie ) కూడా కథమాటలను అందించారు.ఇక వీళ్ళు దూకుడు సినిమాని ఎలాగైతే రివెంజ్ స్టోరీ గా మలిచారో దీన్ని కూడా అదేవిధంగా మలుద్దామనే ఉద్దేశ్యం లోనే ఈ సినిమాని కూడా రాశారు.
కానీ ఈ సినిమాని తెరకెక్కించడంలో మెహర్ రమేష్ చాలావరకు ఫెయిల్ అయ్యాడు.ఎందుకంటే శ్రీను వైట్ల( Srinu Whitela ) దగ్గర ఉన్న కామెడీ మార్క్ మేకింగ్ ఇక్కడ మిస్ కొట్టడంతో ఈ సినిమా ప్లాప్ అయింది.
అయితే మెహర్ రమేష్ ఈ సినిమాని తను అనుకున్నట్టుగా కాకుండా దాంట్లో ఇతరుల ఇన్ పుట్స్ కూడా ఎక్కువ అవ్వడం వల్ల ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటూ గోపి మోహన్ కొన్ని విషయాలను తెలియజేశాడు.

ఇక ఇదే సినిమాలో హీరో ఇన్వాల్వ్ మెంట్ కూడా ఎక్కువగానే ఉందని దానివల్ల కూడా అతని ఇన్ పుట్స్ తీసుకొని మెహర్ రమేష్ ఈ సినిమా చేయాల్సి వచ్చిందని అందువల్లే అది మిస్ కొట్టిందనే ఉద్దేశ్యం లో గోపి మోహన్ రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశాడు…ఇక తను ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్ కాంబోలో వస్తున్న ఒక మూవీ కి రైటర్ గా చేస్తున్నాడు.








