సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటుల వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )లాంటి స్టార్ హీరో ప్రస్తుతం దేవర( devara ) అనే సినిమా చేస్తూ తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.అయితే ఈనెల 8 వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తాం అంటూ సినిమా యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది.

అయితే ఈ సినిమా గ్లిమ్స్ ని చూస్తే మనకు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అనే విషయం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది.అయితే ఈ సినిమా లో చాలామంది నటులు నటిస్తున్నారు.అయితే ఈ సినిమా లో ఒక్క అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ కోసం విపరీతమైన డబ్బులు ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే అది సినిమా మొత్తానికి చాలా ఇంపాక్ట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
ఇక దేవర సినిమా రెండు పార్టు లుగా రిలీజ్ అవుతుంది.ఇక మొదటి పార్ట్ ఈ సంవత్సరం లో రిలీజ్ అవ్వగా, సెకండ్ పార్ట్ మాత్రం వచ్చే సంవత్సరం రిలీజ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ భారీ సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నాడు.

ఎందుకంటే ఈ సినిమాతో సక్సెస్ కనక సాధించినట్లయితే ఎన్టీయార్ వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్ లను అందుకున్న హీరోగా గుర్తింపు పొందుతాడు.ఇక ఇప్పటి వరకు ఉన్న స్టార్ హీరోలు ఎవ్వరూ కూడా వరుసగా 7 సినిమాలతో సక్సెస్ కొట్టలేదు కాబట్టి ఈ రికార్డ్ అనేది ఎన్టీయార్ మీద లిఖించబడుతుంది.చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీయార్ ఏ మేరకు మ్యాజిక్ చేస్తాడో.








