సౌత్ హీరోలు గడ్డాలు మీసాలతో మాస్ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, కన్నడ, అనే తేడా లేకుండా సౌత్ మొత్తం మాస్ మేనియానే కనిపిస్తోంది.
దీంతో ఎక్కువగా హీరోలు సినిమాలలో మాస్ పాత్రల్లో నటిస్తున్నారు.మరి త్వరలోనే మాస్ లుక్ తో అభిమానులకు పూనకాలు తెప్పించబోతున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పుష్ప పార్ట్ వన్ సినిమాతో మాస్ లుక్ లో కనిపించి అభిమానులకు పునగాళ్లు తెప్పించిన అల్లు అర్జున్ పుష్ప 2తో మళ్ళీ స్క్రీన్ పై ఎప్పుడు కనిపిస్తాడా? చిత్తూరు వ్యాసాలు ఎప్పుడు సందడి చేస్తాడా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ( Allu arjun )మాస్ క్యారెక్టర్ లో నటిస్తుండగా మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.భయం అన్నది తెలియని వారికి భయాన్ని పరిచయం చేసే పాత్రలో కనిపిస్తున్నారు తారక్.ఇప్పటికే సర్‌తో సూపర్ సక్సెస్ తెచ్చుకున్న ధనుష్ వచ్చే ఏడాది కెప్టెన్ మిల్లర్( Captain Miller ) మీద కూడా అలాంటి ఆశలే పెట్టుకున్నారు.
అసలే బ్రిటిష్ టైమ్‌లో జరిగే పీరియాడిక్ సినిమా కావడంతో ధనుష్ లుక్‌ని దానికి తగ్గట్టే డిజైన్ చేశారు మూవీ మేకర్స్.అలాగే కంగువ సినిమా ఏకంగా 35 ప్లస్ లాంగ్వేజెస్‌లో రెడీ కాబోతోంది.
అంటే లోకల్, నాన్ లోకల్ అనే మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేదు.
సూర్య లుక్ పక్కా మాస్‌గా ఉంది.దీంతో పాటు ఇంకో తొమ్మిది లుక్కులు ఉంటాయనే టాక్ కూడా ఉంది.ఇలా ఇకమీదట విడుదల కాబోయే సినిమాలలో కూడా హీరోలు మాస్ లుక్ లోనే ఎక్కువగా కనిపించబోతున్నారు.
అభిమానులు కూడా హీరోలను మాస్ లుక్ లో చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు.పుష్ప లో అల్లు అర్జున్, దేవరలో ఎన్టీఆర్, కంగువలో సూర్య, కెప్టెన్ మిల్లర్ తో ధనుష్( Dhanush ) లు మాస్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించబోతున్నారు.






