గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుష్ప నటుడు జగదీష్( Jagadish ) పేరు మారుమోగుతున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇటీవల ఒక యువతి విషయంలో జగదీష్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.
దాంతో అప్పటి నుంచి ఆయన పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే.అసలేం జరిగిందంటే.
సినీ నటుడు బండారు ప్రతాప్ అలియాస్ జగదీశ్ ను ఇటీవల ఒక యువతి ఆత్మహత్య విషయంలో పంజాగుట్ట పోలీసులు( Panjagutta Police ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే.అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు.
సినీ అవకాశాల కోసం నగరానికి చేరిన జగదీశ్ కు అయిదేళ్ల క్రితం ఒక యువతితో పరిచయమైంది.

అయితే కొంత కాలానికి అది ప్రేమగా మారి శారీరకంగానూ దగ్గరయ్యారు.ఈ క్రమంలో పుష్ప సినిమాతో( Pushpa Movie ) ఒక్కసారిగా గుర్తింపు రావటంతో సినిమా అవకాశాలు పెరిగి అతని ప్రవర్తనలో మార్పు వచ్చింది.అయితే ఇది నచ్చని యువతి మరో యువకుడికి దగ్గరైంది.
ఆ విషయం తెలుసుకున్న జగదీశ్ ఏదో విధంగా ఆమెను మళ్లీ దారిలోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు.గత నెల 27న పంజాగుట్ట ఠాణా పరిధిలో నివాసం ఉంటున్న యువతి ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో సదరు యువకుడితో ఆమె సన్నిహితంగా ఉండటం చూసి సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీశాడు.వాటిని ఆమెకు పంపి తన మాట వినకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు.

అయితే దాన్ని అవమానంగా భావించిన యువతి గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.జగదీశ్ బెదిరింపులతోనే అఘాయిత్యానికి పాల్పడినట్లుగా గుర్తించిన ఆమె తండ్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 6న జగదీశ్‌ను అరెస్టు( Jagadish Arrest ) చేసి రిమాండుకు తరలించారు.అనంతరం కస్టడీలోకి తీసుకొని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం.
రెండు రోజుల కస్టడీ ముగియటంతో తిరిగి రిమాండుకు తరలించారు.అయితే ఆ విచారణలో కేవలం ఆ యువతిని తన దారికి తెచ్చుకోవడం కోసమే అలాంటి పని చేసినట్టు జగదీష్ పోలీసులకు వెల్లడించారు.







