తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో హరీష్ శంకర్(Harish Shankar ) ఒకరు.ఈయన చేసిన మొదటి సినిమా నుంచి నా చివరగా చేసిన గడ్డల కొండ గణేష్ సినిమా వరకు ప్రతి సినిమా కూడా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగుతూ ఉంటాయి.
ఇక ఇలాంటి కమర్షియల్ డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు.ముఖ్యంగా పూరి జగన్నాథ్ దగ్గర శిష్యరికం చేసిన హరీష్ శంకర్ ఆయన స్టైల్ లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను కొడుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక మూడు నెలలు పాటు పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ గ్యాప్ లో రవితేజ( Ravi Teja )తో సినిమా చేయాలని అనుకుంటున్నా విషయం అందరికీ తెలిసిందే…
అయితే ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీద కి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ వ్యవహారాలంతా తను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనిమల్ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని రెండు మూడు రోజుల్లో బయటపెట్టబోతున్నాట్టుగా కూడా తెలుస్తుంది.
ఇక సినిమాతో మరోసారి వాళ్ల స్టామినా ఏంటో చూపించడానికి హరీష్ శంకర్ రవితేజ ఇద్దరు కలిసి మన ముందుకు వస్తున్నారు.
ఇక రవితేజ హరిష్ శంకర్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన మిరపకాయ్ సినిమాకి ఏమాత్రం తీసిపోకుండా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని రవితేజ హరీష్ శంకర్ ఇద్దరు కూడా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా సక్సెస్ కొట్టి మళ్ళీ పవన్ సినిమాలో జాయిన్ అవ్వాలని హరీష్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది…
.