మైక్ ఉంది కదా అని కొంతమంది విలేఖరులు మీడియా పేరు ని అడ్డుపెట్టుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగడం, వాటికి సెలెబ్రిటీలు ఎంతో ఇబ్బంది పడడం వంటివి మనం ఇటీవల కాలం లో చాలా సందర్భాల్లో చూసాము.హీరో హీరోయిన్లు సినీ రంగం కాబట్టి వాళ్ళు అసలు మనుషులే కాదు, వాళ్లకు మనసే ఉండదు అన్న విధంగా కొంతమంది జర్నలిస్టులు ప్రవర్తిస్తుంటారు.
అలాంటి జర్నలిస్టుల కారణం గా మీడియా అంటే జనాలకు చులకన అయిపోయింది.అటువంటి చెత్త జర్నలిస్టుల జాబితాని తీస్తే సురేష్ కొండేటి( Suresh Kondeti ) నెంబర్ 1 స్థానం లో నిలుస్తాడు.
ఇతను కావాలనే వివాదాలు సృష్టించాలని, తద్వారా సోషల్ మీడియా లో ట్రెండ్ అవ్వాలని హీరోయిన్స్ ని హీరోలను పిచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు.ఎన్ని సార్లు సెలబ్రిటీస్ చేత చివాట్లు పెట్టించుకున్నా కూడా ఇతని ధోరణి ఏమాత్రం మారడం లేదు.50 ఏళ్ళ వయస్సు ఉన్న ఇతని మెదడు లోని ఆలోచనలు చూస్తే ఎవరికైనా కోపం రావాల్సిందే.
ఇతని వల్ల జర్నలిజం కి విలువలు తగ్గిపోతున్న ఈ నేపథ్యం లో జర్నలిస్ట్ అస్సోసియేషన్( Journalist Association ) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక మీదట సురేష్ కొండేటి ఎలాంటి ప్రెస్ మీట్స్ కి కానీ, మీడియా ఇంట్రాక్షన్స్ కి కానీ రాకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.అతను సంతోషం అనే మ్యాగజైన్ ని నడుపుతున్నాడు కాబట్టి, ఆయన సంస్థ నుండి ఎవరైనా జర్నలిస్టులు లేదా పీఆర్వో లు రావొచ్చు అని చెప్పుకొచ్చింది.జర్నలిజం( Journalism ) లో అన్నీ ఒక పద్దతి ప్రకారం జరిగేందుకు గాను, జర్నలిస్టులందరు కలిసి ఒక అస్సోసియేషన్ ని ఏర్పాటు చేసుకున్నారు.
ఈ అస్సోసియేషన్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఫైనల్.కాబట్టి ఇక మీదట సురేష్ కొండేటి ని ప్రెస్ మీట్స్ లో చూసే దురదృష్టం నుండి ఆడియన్స్ కి విముక్తి కలిగినట్టే అని చెప్పొచ్చు.
అయితే తన సంస్థ నుండి ఎవరైనా పీఆర్వో లు ప్రెస్ మీట్స్ కి రావొచ్చు అని అస్సోసియేషన్ చెప్పింది.
మరి సంతోషం మ్యాగజైన్ నుండి వచ్చేవాళ్ళు కూడా సురేష్ కొండేటి లాగ ప్రశ్నలు అడిగరని గ్యారంటీ ఏమిటి?, తన పీఆర్వోల చేత సురేష్ కొండేటి తాను అడగాల్సిన ప్రశ్నలను వారి చేత అడిగిస్తే సురేష్ ని బ్యాన్ చేసి లాభం ఏమి ఉంది అని మీరు అనుకోవచ్చు.కానీ ఇక్కడే అసలు మెలిక ఉంది, ఆయన సంస్థ నుండి వచ్చే వాళ్ళు ముందుగా ఎలాంటి ప్రశ్నలు అడగబోతున్నారు అనేది అస్సోసియేషన్ చీఫ్ కి పంపాలట.వాళ్ళ ఆమోదం తెలిపిన తర్వాతే ప్రెస్ మీట్స్ లో పాల్గొనేందుకు అనుమతిని ఇస్తారట.
అలా మొత్తానికి సురేష్ కొండేటి నోటికి అయితే తాళం వేయగలిగారు.