తమిళ నటి విచిత్ర సంచలన ఆరోపణలు చేశారు.తెలుగు హీరో నందమూరి బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ప్రస్తుతం బిగ్ బాస్ ప్రొగ్రాంలో కంటెస్టెంట్ గా ఉన్న నటి విచిత్ర ఓ ఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.దాదాపు 20 ఏళ్ల కిందట జరిగిన ఈ ఘటన వలన తాను సినిమాలకు దూరమయ్యాయని తెలిపారు.2000 సంవత్సరంలో ‘భలేవాడివి బాసూ’ అనే తెలుగు సినిమాలో నటించిన తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.సినిమా షూటింగ్ సమయలో తనను ఒక త్రి స్టార్ హోటల్ లో ఉంచారన్న ఆమె ఓ రోజు సాయంత్రం తాను పార్టీలో సినిమా హీరోను కలిసానని చెప్పారు.
అతనికి తన పేరు కూడా తెలియదు కానీ డైరెక్ట్ గా తన గదికి రమ్మని అడిగాడని ఆరోపించారు.షాక్ గురైన తాను ఆ తరువాత రోజు నుంచి చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
సెట్ లో తనను ఎక్కడ పడితే అక్కడ ముట్టుకునే వారని, డైరెక్టర్ చెప్పినా తననే కొట్టి ఎవరికైనా కంప్లైంట్ చేసుకోమనే వారని తీవ్ర ఆరోపణలు చేశారు.







