నల్లగొండ జిల్లా:ఓ ఓటరు మహాశయుల్లారా…కోటరు కోసం ఆశ పడితే మన జీవితాలు కొల్లగొట్టే బడతాయి.ఉచితాలు కాకుండా కార్పొరేట్ విద్య, వైద్యం ఉచితంగా కావాలని పార్టీలను అడగండి.
తెలంగాణలో ప్రభుత్వ విద్య బాగుంటే మంత్రుల,ఎమ్మెల్యేల, ఎంపిల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలలో,జూనియర్ కాలేజీలో ఎందుకు చదవటం లేదు?ఇతర రాష్ట్రాలకు,దేశాలకు ఎందుకు పోతున్నారు?తెలంగాణ( Telangana )లో ప్రభుత్వ వైద్యం బాగుంటే మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపిలు రోగాలోస్తే ప్రభుత్వ వైద్య శాలలలో ఎందుకు ట్రీట్ మెంట్ చేపించుకోడం లేదు.ప్రైవేట్,కార్పొరేట్ దవాఖానకు ఎందుకు పోతున్నారు? లేదా ఇతర రాష్ట్రాలకు,దేశాలకు ఎందుకు పోతున్నారు? మంత్రుల ఎమ్మెల్యేల ఎంపిల కుటుంబాలకు పనికిరాని ప్రభుత్వ విద్య, వైద్యం పేద,మధ్యతరగతి ప్రజలకు పనికి వస్తుందా?కష్టపడి సంపాదించింది మొత్తం అమ్ముకొని ప్రజలు విద్య,వైద్యం కొనుకుంటున్నది నిజం కాదా?కార్పొరేట్ లెవల్ లో విద్య,వైద్యం ఎందుకు ఉచితం చేయలేక పోతున్నారు.
అది చేత కాదా?రెండు వేలు ఇస్తాం, ఐదు వేలు ఇస్తాం, పదిహేను వేలు ఇస్తాం నాలుగు వందలకు సిలిండర్( Gas Cylinder ) ఇస్తామని పనికిరాని పథకాలను ప్రజలకు ఎరవేసి ఓట్లు పొంది అధికారం పొందాలనే నీచ ఆలోచన తప్ప ఈ నాయకులతో ఊరుకాదు పీరి కూడా లేవదని రుజువు అవుతుంది కదా!పాలనకు పనికిరాని సన్నాసులు చెప్పే మాటలు నమ్మకండి.విద్య,వైద్యం గురించి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడడు ఎందుకు?ఏం మాయదారి రోగం?విద్య, వైద్యం ఉచితం చేయడానికి పాలకపక్షం, ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చెప్పాలని డిమాండ్ చేయండి.ప్రజలారా…! ఇలాంటి చవటలకు ప్రచారం చేయడం ఓటు వేయడం దండుగ.విద్య, వైద్యం ఉచితం చేయాలని ఉద్యమం చేద్దాం కదిలి రండి.
ప్రైవేట్ విద్యను, వైద్యాన్ని జాతీయం చేసి ప్రభుత్వాలే నిర్వహించాలి.విద్యా సంస్థల( Educational institutions ) వద్ద,వైద్య సంస్థల వద్ద పార్మాసుటికల్ కంపెనీల వద్ద లంచాలు పుచ్చుకొని వారు ఫీజులు,ధరలు పెంచినా చోద్యం చూస్తున్న పాలకులు.
ఈ దోపిడీ ఆపే వారే లేరు.ఓటు అడగడానికి వచ్చినప్పుడు కార్పొరేట్ విద్య,వైద్యం ఉచితం చేయమని అడగండని ఉచిత విద్య, వైద్య సాధన సమితి పిలుపునిస్తుంది.