చంద్రబాబు చుట్టూ సీ"రియల్ " ఎపిసోడ్లు ?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu naidu arrest ) చుట్టూ ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కష్టంగా ఉంది.వచ్చే ఎన్నికల్లో సి‌ఎం కావాలని కలలు కంటున్న ఆయన అనూహ్యంగా స్కిల్ స్కామ్( Skill Devolopment Scam ) లో ఇరుక్కోవడం, ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లోనే ఉండడం, నిర్ధోషిగా నిరూపణ అయ్యే వరకు ఆయన జైలుకే పరిమితం కావడం వంటి పరిణామాలతో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలే అంచనా వేయలేక పోతున్నారు.

 serial Episodes Around Chandrababu, Skill Devolopment Scam , Cid , Tdp , Ycp, S-TeluguStop.com

ఇక స్కిల్ స్కామ్ విషయంలో నేడు ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు బాబును మరికొన్ని రోజులు జైలుకే పరిమితం చేసింది.

Telugu Chandrababu, Skill Scam-Politics

ఈ నెల 24 వరకు రిమాండ్ ను పొడిగించింది దర్మాసనం.దీంతో ఆయన మరో రెండు రోజులు జైళ్ళోనే ఉండాల్సిన పరిస్థితి ఆ తరువాత కూడా జైలు వచ్చే అవకాశం ఉందా అంటే న్యాయస్థానం ఇచ్చే తీర్పును బట్టి ఉంటుంది.మరోవైపు క్వాష్ పిటిషన్ పై హైకోర్టు కూడా ఇవాళే తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.

మరి హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై సిఐడి పక్కా ఆధారాలను చూపిస్తుండడంతో ఆయన తరుపు లాయర్లు కూడా పెద్దగా ప్రభావం చూపించలేక పోతున్నారు./br>

Telugu Chandrababu, Skill Scam-Politics

దేశంలో టాప్ లాయర్స్ గా పేరున్న లూథ్రా( Siddharth Luthra ), హరీష్ సాల్వే వంటి వారు కూడా చంద్రబాబును నిర్ధోషిగా నిరూపించడంలో తడబడుతున్నారు.ఇది చాలదన్నాట్లు ఫైబర్ స్కామ్ కూడా చుట్టుకుంది.ఈ పరినమలన్నీ బాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.దాంతో చంద్రబాబు జైలుకే పరిమితం అవుతారని వైసీపీ చెబుతోంది.మొత్తానికి తాజా పరిణామలన్ని సీరియల్ ఎపిసోడ్స్ మాదిరి సాగుతూనే ఉండడంతో బాబుకు బెయిల్ ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు.అసలు వస్తుందా ? రాదా ? అనేది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.మరి ఈ విపత్కర పరిస్థితుల నుంచి చంద్రబాబు ఎలా బయట పడతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube